బాబుగారూ.. ఇదేనా మీ సుపరిపాలన? గుంటూరు మహిళపై దాడి ఘటనపై వైఎస్ జగన్!
గుంటూరులో మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేసిన ఘటన ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన పైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చ మాత్రమే కాదని, రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి కూడా నిదర్శనమని జగన్ మండిపడ్డారు. బాబు గారు మహిళల రక్షణ ఇదేనా అంటూ చంద్రబాబును వైయస్ జగన్ టార్గెట్ చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
గుంటూరులో జరిగిన ఈ దారుణానికి చంద్రబాబు ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి అని జగన్ విమర్శించారు. బుధవారం ఘటన జరిగితే మూడు రోజులపాటు దాన్ని కప్పి పెట్టారని, చివరికి వీడియోలు సోషల్ మీడియాలో బయటకు వస్తే ఇప్పుడు తామేదో గొప్ప చర్యలు తీసుకుంటున్నట్టు హడావుడి చేస్తున్నారని జగన్ విమర్శించారు.

రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయో చెప్పాలని జగన్ నిలదీత
వీడియోలను కప్పిపుచ్చే దానిపై పెట్టే శ్రద్ధ బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడే తీసుకుని ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని జగన్ టార్గెట్ చేశారు బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని ఉంటే జరిగేదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు ఎందుకు ఉన్నాయో చెప్పాలని నిలదీసిన జగన్, అధికార పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేయడానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయా అంటూ మండిపడ్డారు.
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
బాధితురాలికి అండగా నిలవకపోగా పంచాయతీలు చేయడానికి ప్రయత్నిస్తారా అంటూ జగన్ ప్రశ్నించారు. నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతున్న వేళ చర్యలు తీసుకుంటున్నాం అంటూ నాటకాలు ఆడతారా అంటూ వైయస్ జగన్ మండిపడ్డారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగ నడుస్తోందని ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహిస్తుందని వైయస్ జగన్ ఆరోపణలు చేశారు.
టిడిపి కూటమి నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారు
అధికార పార్టీ నేతలలో తాము ఏం చేసినా పోలీసులు తమని రక్షిస్తారని ధైర్యం కనిపిస్తుందని ఆయన అన్నారు. టిడిపి నేతలు కూటమి నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారని వైయస్ జగన్ మండిపడ్డారు. మహిళలపై దాడి చేసిన, అవమానించిన, వేధించిన తమకు ఏమీ కాదని, చంద్రబాబు తనను కాపాడతారనే ధైర్యం వారిలో పెరిగింది అన్నారు.
ఇదేనా మీ సుపరిపాలన
చంద్రబాబు గారు ఇదేనా మీ సుపరిపాలన అంటూ ప్రశ్నించారు. ఇదేనా మీ పోలీసింగ్ అంటూ నిలదీశారు. మహిళల ఆగ్రహం టిడిపి కూటమి ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తుందని జగన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తారు.












Click it and Unblock the Notifications