లిక్కర్ కేసులో సీఈవో వివేక్‌ యాదవ్‌ కు సిట్ నోటీసులు..!!

లిక్కర్ కేసులో కీలక పరిణామం. వైసీపీ హయాంలో భారీ స్థాయిలో లిక్కర్ కుంభకోణం జరిగిందనే అభియోగాలతో సిట్ విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. పెద్ద సంఖ్యలో విచారణ జరిగింది. కొద్ది రోజుల క్రితం రిటైర్డ్ ఐఏఎస్ రజిత్ భార్గవ్ ను విచారించిన సిట్ ఇప్పుడు మరో ఐఏఎస్ అధికారికి నోటీసులు జారీ చేసింది. విచారణ టీం ఇప్పుడు ఆ అధికారి వద్దకు వెళ్లి కేసుకు సంబంధించిన వివరాల పై సమాచారం ఆరా తీసే అవకాశం ఉంది.

లిక్కర్ కేసులో ఐఏఎస్‌ అధికారి వివేక్‌ యాదవ్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వివేక్ యాదవ్ ఎక్సైజ్‌ కమిషనర్‌గా పని చేసారు. దీంతో.. ఆ సమయంలో చోటు చేసుకున్న నిర్ణయాలతో పాటుగా మద్యం విధానం అమలు, ఆర్డర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్ఎస్‌) ప్రక్రియ, అప్పటి అడ్డగోలు నిర్ణయాలు, రికార్డుల తారుమారు తదితర అంశాలపై అవగాహన ఉటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన నుంచి సమాచారాన్ని నమోదు చేసుకోవడానికి దర్యాప్తు అధికారులు కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న వివేక్‌ యాదవ్‌ 'సర్‌' కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. దీంతో.. ఆయన విచారణ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చి ఇచ్చిన 164 స్టేట్‌మెంట్‌లో...వివేక్‌ యాదవ్‌పై ఒత్తిడి తెచ్చినా నిబంధనలకు వ్యతిరేక నిర్ణయాల ఫైళ్లపై సంతకాలు చేయలేదని చెప్పినట్లు తెలుస్తోంది.

బొత్సా ఫ్యామిలీ ముఖ్య నేత పై జగన్ వేటు, కన్నీళ్లు పెట్టినా - ఏం జరుగుతోంది..!!
బొత్సా ఫ్యామిలీ ముఖ్య నేత పై జగన్ వేటు, కన్నీళ్లు పెట్టినా - ఏం జరుగుతోంది..!!
sit-notices-to-sec-ceo-vivek-yadav-in-liquor-case-investigation-officials-to-take-statement-form-hi

సిట్ నోటీసుల వేళ

కాగా.. మద్యం స్కామ్‌లో కీలక నిందితుడైన సత్య ప్రసాద్‌ తన వాంగ్మూలంలోనూ వివేక్‌ యాదవ్‌ ఎలాంటి తప్పూ చేయలేదని కోర్టుకు వివరించారు. చోటు చేసుకున్న పరిణామాలు.. నిబంధనల ఉల్లంఘన వెనుక ఎవరి ప్రమేయం ఉంది.. ఎవరి ప్రోద్భలంతో ఈ వ్యవహారాలు జరిగాయనే అంశా ల పైన విచారణ అధికారులు ఎక్సైజ్‌ మాజీ కమిషనర్‌ నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి కోర్టులో చార్జిషీట్‌ వేయాల్సి ఉంది. దీంతో, మరో నోటీసు జారీ చేసిన సిట్‌కు శనివారం తాను విచారణకు సిద్ధమని వివేక్‌ యాదవ్‌ తెలిపినట్లు సమాచారం. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన వద్దకే దర్యాప్తు బృందం వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్నట్లు తెలిసింది. లోకల్ మద్యం బ్రాండ్లకు ప్రాధాన్యం, ఓఎఫ్ఎస్‌ విధానాన్ని మాన్యువల్‌గా మార్చడం, తదితర అంశాలపై వివేక్‌ యాదవ్‌ వివరణ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో సీఎంవోలో పనిచేసిన వ్యక్తులు, ఎక్సైజ్‌ అధికారులు, లిక్కర్‌ వ్యాపారులను ఇప్పటికే సిట్ ప్రశ్నించింది. దీంతో.. ఇప్పుడు వివేక్‌ యాదవ్‌ సిట్‌ అధికారులకు అప్పటి నిర్ణయాలపై ఏమి చెబుతారు.. తదనంతర పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+