ఇండియాతో ఫైనల్ అంటేనే భయం? మ్యాచ్‌కు ముందే పాక్ కెప్టెన్‌ షాకింగ్ కామెంట్స్!

IND vs PAK: 2026 ఆసియా క్రీడల్లో అత్యంత ఉత్కంఠభరితమైన క్రికెట్ మ్యాచ్‌కు వేదిక సిద్ధమైంది. దాయాదులైన భారత్, పాకిస్తాన్ జట్లు స్వర్ణ పతకం కోసం తలపడనున్నాయి. ఈ చారిత్రాత్మక మ్యాచ్ కంటే ముందే పాకిస్తాన్ కెప్టెన్ సాహిబ్జాద్ ఫర్హాన్ చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. స్టేడియంలో రెండు జట్ల మధ్య పోరుకు ముందు ఫర్హాన్ గంభీరంగా స్పందించడం విశేషం.

ఒక్కరోజే 10 పతకాలు.. 6 స్వర్ణాలతో భారత్ సంచలనం!
ఒక్కరోజే 10 పతకాలు.. 6 స్వర్ణాలతో భారత్ సంచలనం!

క్రికెట్లో ఏమైనా జరగొచ్చు.. ఫర్హాన్ మైండ్ గేమ్
స్వర్ణ పతక పోరుకు ముందే మాట్లాడుతూ.. పాకిస్తాన్ సారథి ఫర్హాన్ తమ వ్యూహాలను, ప్రత్యర్థిపై ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టారు. "ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా పర్వాలేదు. క్రికెట్ అనేది తీవ్ర అనిశ్చితితో కూడుకున్నది. ఇక్కడ ఏ నిమిషంలోనైనా ఏమైనా జరగవచ్చు. శ్రీలంక, భారత్ రెండూ బలమైన జట్లే. అయితే సెమీఫైనల్ ముగిసిన తర్వాత ఫైనల్లో మా ప్రత్యర్థి ఎవరో తేలిన వెంటనే దానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతాం" అని సాహిబ్జాద్ ఫర్హాన్ పేర్కొన్నారు.

Asian Games 2026 Pakistan Captain Sahibzada Farhan Comments Ahead of IND vs PAK Gold Match

భారత్‌తో పోరాటానికి పాక్ సిద్ధం
భారత్ రూపంలో ఎదురవుతున్న భారీ సవాలు గురించి తమకు పూర్తి స్పష్టత ఉందని సాహిబ్జాదా ఫర్హాన్ వెల్లడించారు. "ఎదురుగా ఉన్నది భారత్ అయినా, శ్రీలంక అయినా.. మేము స్టేడియంలో దిగి పటిష్టమైన, శ్రమతో కూడిన క్రికెట్‌ను ఆడుతాం" అని స్పష్టం చేశారు. ఒత్తిడికి లొంగకుండా అనుకున్న వ్యూహాలను స్టేడియంలో సమర్థవంతంగా అమలు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Asian Games 2026: 44 ఏళ్ల నిరీక్షణకు తెర..భారత్‌కు గోల్డెన్ విక్టరీ!
Asian Games 2026: 44 ఏళ్ల నిరీక్షణకు తెర..భారత్‌కు గోల్డెన్ విక్టరీ!

అద్భుత ఫామ్‌లో శ్రేయస్ సేన
మరోవైపు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు ఆసియా క్రీడల్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తోంది. సెమీఫైనల్ పోరులో శ్రీలంకను 124 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసి భారత్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మల ధాటికి శ్రీలంక జట్టు కేవలం 45 పరుగులకే కుప్పకూలిపోయింది. మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్ జట్టును ఓడించి పాకిస్తాన్ ఫైనల్ కు అర్హత సాధించింది.

ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారి
ఆసియా క్రీడల క్రికెట్ చరిత్రలోనే భారత్-పాకిస్తాన్ జట్లు గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ముఖాముఖి తలపడటం ఇదే మొదటిసారి. 2023 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో సాధించిన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోవాలని భారత్ భావిస్తుండగా.. భారత విజయపరంపరకు అడ్డుకట్ట వేసి స్వర్ణాన్ని ముద్దాడాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. అయితే నిషిన్ వేదికగా జరిగే ఈ తుదిపోరుపై వర్షం ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఇరు జట్లు వాతావరణ పరిస్థితులపై కూడా కన్నేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+