బొత్సా ఫ్యామిలీ ముఖ్య నేత పై జగన్ వేటు, కన్నీళ్లు పెట్టినా - ఏం జరుగుతోంది..!!

ఏపీలో స్థానిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశాల్లో పోటీ .. సీట్ల పైన ప్రాధమిక కసరత్తు జరుగుతోంది. మాజీ సీఎం జగన్ ఈ ఎన్నికల వేళ జిల్లాల వారీ గా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇదే సమయంలో విజయనగరంలో జగన్ నిర్ణయాలు ఆసక్తిగా మారుతున్నాయి. బొత్సా కుటుంబలోని మరో ముఖ్య నేత పై జగన్ సస్పెన్షన్ వేటు వేసారు.

విజయనగరం కేంద్రంగా వైసీపీలో కొత్త రాజకీయం మొదలైంది. మజ్జి శ్రీను పార్టీ వీడిన తరువాత బొత్సా కుటుంబంలోని కొందరు నేతలు ఆయన తో టచ్ లో ఉన్నారు. దీంతో.. తాజాగా స్థానిక ఎన్నికల పైన జిల్లాల వారీగా ఒన్ టు ఒన్ సమీక్ష చేసిన జగన్ బొత్సాతో సుదీర్ఘంగా జిల్లాలో పార్టీ పరిస్థితి పైన చర్చించారు. మజ్జి శ్రీను పార్టీ వీడిన తరువాత కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు... చీపురుపల్లి, నెల్లిమర్ల లో తాజాగా పార్టీ వీడుతున్న వారి వివరాలు పైన బొత్సా పూర్తి స్థాయి నివేదిక సమర్పించారు. మజ్జి శ్రీను పార్టీ వీడిన సమయంలోనే ఆయన వియ్యంకుడు, బొత్సకు సమీప బంధువు అయిన నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడును నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. నెల్లిమర్ల జెడ్పీటీసీకి ఆ బాధ్యతలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇప్పుడు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జగన్ నిర్ణయం ప్రకటించారు.

 తిరుమల కిటకిట, భక్తుల నిరసనలు- రద్దీ తగ్గే వరకూ ఇక... టీటీడీ కీలక నిర్ణయం..!!
తిరుమల కిటకిట, భక్తుల నిరసనలు- రద్దీ తగ్గే వరకూ ఇక... టీటీడీ కీలక నిర్ణయం..!!
ysrcp-chief-ys-jagan-suspended-appalanaidu-form-the-party-after-review-with-botsa-and-others

జగన్ కీలక నిర్ణయాలు వెనుక

చిన్న శ్రీను రాజీనామా జిల్లాస్థాయి సమావేశంలో బొత్సతోపాటు బడ్డుకొండ కూడా కన్నీరు పెట్టు కున్నారు. తమ కుటుంబంలో చోటుచేసుకున్న రాజకీయాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బడ్డుకొండ సీనియర్ నేత బొత్సకు సమీప బంధువు. ఒకసారి జిల్లా పరిషత్ చైర్మనుగా పనిచేసిన బడ్డుకొండ అప్పలనాయుడు రెండుసార్లు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా పనిచేశారు. చిన్న శ్రీనుకు స్వయాన బావ, వియ్యంకుడు అయిన బడ్డుకొండ కూడా ఆయనతో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయని భావించారు. అయినా.. తాను బొత్సతోనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ చెప్పారు. కానీ, వైసీపీ అధిష్టానం ఆయనను విశ్వసించలేదని స్పష్టం అవుతోంది.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగంతో బడ్డుకొండపై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా. సీనియర్ నేత బొత్స సిఫార్సులతోనే పార్టీ ఈ చర్య తీసుకున్నట్లు పార్టీలో చర్చ సాగుతోంది. ఈ పరిణామాల వేళ బొత్సా కుటుంబంలో ఎవరు ఎవరి వైపు అనే చర్చ మొదలైంది. జగన్ సైతం బొత్సా తో పార్టీ కంటే ఎవరు ఎక్కువ కాదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయం పై ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+