పెరిగిన ఎండల వేళ దూసుకొస్తున్న మరో వాయుగుండం- ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. రెండో వేసవి కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పెరుగుతున్న ఎండ తీవ్రతతో ఇబ్బందు లు తప్పటం లేదు. ఇదే సమయంలో విపత్తుల నిర్వహణ శాఖ కీలక అప్టేట్ ఇచ్చింది. బంగాళా ఖాతంలో ఏర్పడుతున్న అల్ప పీడనం.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని వెల్లడించింది.

వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ లో తరహాలో ఈ నెలలో బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఈనెల 12న అండమాన్‌ సముద్రంపై ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 13వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడి, ఈనెల 15 నాటికి దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావం కోస్తా, రాయలసీమలో ఉంటుందని అంచనా వేసింది. అయితే దీనిపై మరో నాలుగైదు రోజుల్లో స్పష్టత వస్తుందని పేర్కొంది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, ఎక్కువ ప్రాంతాల్లో ఎండ తీవ్రత నెలకొంటుందని తెలిపింది. కాగా, ఈ రోజు(శనివారం) అల్లూరి, పోలవరం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు పడతాయని వివరించింది.

 లిక్కర్ కేసులో సీఈవో వివేక్‌ యాదవ్‌ కు సిట్ నోటీసులు..!!
లిక్కర్ కేసులో సీఈవో వివేక్‌ యాదవ్‌ కు సిట్ నోటీసులు..!!
apsdma-predicts-low-pressure-area-over-south-bay-of-bengal-likely-to-intensify-into-depression-by-oc

పలు జిల్లాలకు వర్ష సూచన

ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వేసవిని తలపించే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శుక్రవారం కడప, తిరుపతి జిల్లాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా, అల్లూరి, బాపట్ల, ఎన్టీఆర్‌, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడ్డాయి. మరోవైపు.. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉత్తర, మధ్య భారతదేశం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణంలో వస్తున్న తాజా మార్పులతో అక్కడక్కడా పిడుగులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నట్లు హెచ్చరించింది. మిగతా కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు.. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వానలు కురవనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+