భారత్- పాకిస్తాన్ ఫైనల్ టీ20 మ్యాచ్.. ఇంకాస్సేపట్లో

జపాన్ ఐచి- నగోయాలో కొనసాగుతున్న ఆసియా గేమ్స్ లో భాగంగా దాయాదుల ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ఈ ఉదయం 10 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బంగారు పతకం కోసం తలపడనున్నాయి.. ఈ రెండు జట్లు. జపాన్‌ నిస్సిన్ సిటీలో గల కొరోగీ అథ్లెటిక్ పార్క్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా వరుసగా రెండోసారి స్వర్ణం సాధించాలని పట్టుదలగా ఉండగా, పాకిస్థాన్ తొలిసారి పసిడి పతకాన్ని ముద్దాడాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. దేశానికి డబుల్ ధమాకా లభిస్తుంది. ఇప్పటికే ఫైనల్ లో శ్రీలంకను ఓడించి భారత మహిళల జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ టోర్నీ అంతా వర్షం నీడలోనే సాగుతోంది. భారత్, పాకిస్తాన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఫైనల్ రోజున వాతావరణం ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పుడు అందరి చూపూ నిలిచింది.

IND vs PAK Playing 11 for Today s Match in Japan as both teams eyeing on Gold set to face challenges

భారత్, పాకిస్థాన్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌ వర్షార్పణం కావడంతో మెరుగైన సీడింగ్ ర్యాంకింగ్స్ ఆధారంగా సెమీఫైనల్స్ చేరాయి. సెమీస్‌లో టీమిండియా 124 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. బంగ్లాదేశ్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. పాకిస్తాన్. ఈ రెండు జట్లు కూడా టీ20 ఇంటర్నేషనల్స్ లో ఇప్పటివరకు 17 సార్లు తలపడ్డాయి. వీటిల్లో మెజారిటీ మ్యాచ్ లు భారత్ వే. టీమిండియా 13 సార్లు విజయం సాధించగా, పాకిస్తాన్ మూడింట్లో మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్ టై అయింది.

ఈ రెండు రాష్ట్రాల్లో ఓవర్ హాలింగ్: నూతన పీసీసీ అధ్యక్షుల నియామకం
ఈ రెండు రాష్ట్రాల్లో ఓవర్ హాలింగ్: నూతన పీసీసీ అధ్యక్షుల నియామకం

ప్రస్తుత ఆసియా క్రీడలలో వర్షం మ్యాచ్‌ల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకవేళ శనివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే విజేతను నిర్ణయించడానికి నూతన నిబంధనను తీసుకొచ్చారు. మ్యాచ్ రద్దయితే ఉమ్మడిగా భారత్, పాకిస్తాన్ జట్లకు బంగారు పతకాన్ని అందజేస్తారు. 2023 నాటి హంగ్జౌ ఆసియా గేమ్స్ లో వర్షం పడినప్పుడు మెరుగైన ఐసీసీ ర్యాంకింగ్ సీడింగ్ ఆధారంగా భారత్‌కు మాత్రమే స్వర్ణం ఇచ్చారు. ఇప్పుడు నిబంధనలు మారాయి.

తిరుపతిలో ఇంకాస్సేపట్లో టీటీడీ భారీ కార్యక్రమం
తిరుపతిలో ఇంకాస్సేపట్లో టీటీడీ భారీ కార్యక్రమం

శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టులో టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి కళ్లూ ఉన్నాయి. ఈ యంగ్ ఓపెనర్ సెమీస్‌లో ధాటిగా ఆడాడు. వీరితో పాటు సీనియర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు సాహిబ్‌జాదా ఫర్హాన్ సారథ్యంలోని పాకిస్తాన్ లో స్పిన్నర్ సుఫ్యాన్ మోకిమ్, హిట్టర్ అబ్దుల్ సమద్ కీలకం కానున్నారు. పేస్ బౌలింగ్ విభాగంలో జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ టీమిండియా పేస్ అస్త్రాలు.

భారత్ తుది జట్టులో.. వైభవ్ సూర్యవంశీ , అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, జస్ ప్రీత్ బుమ్రా ఆడే అవకాశాలు ఉన్నాయి.

పాకిస్థాన్ తుదిజట్టులో.. సాహిబ్జాదా ఫర్హాన్ (కేప్టెన్), సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), మజ్ సదాకత్, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, అహ్మద్ డానియాల్, మహ్మద్ వాసిమ్ జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ మొకిమ్ లకు చోటు దక్కొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+