అమెరికాలో పట్టపగలు హిందూ ఆలయంపై దాడి..

అమెరికాలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఒహియోలోని ఓ హిందూ దేవాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, ఇటుకలు విసిరారు. ఈ ఘటనలో ఆలయం కిటికీ అద్దాలు పగిలాయి. కాంపౌండ్ వాల్ దెబ్బతిన్నది. ఈ దాడి సమయంలో అర్చకులు, కొందరు భక్తులు ఆలయం లోపలే ఉన్నారు. ఈ ఘటన ఇప్పుడు అమెరికా, భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ఆగ్రహాన్ని, ఆందోళనను రేకెత్తిస్తోంది.

ఓహియో రిచ్‌మండ్ హైట్స్ లో ఉందీ ఆలయం. శ్రీ స్వామినారాయణ్ వడ్తాల్ ధామ్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దీనికి సంబంధించిన వివరాలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ ఘోర దాడి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలోనే పూజారులతో పాటు కొందరు భక్తులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.

Hindu temple attacked in Richmond Heights Ohio threw bricks at the temple causing significant damage

దుండగులు విసిరిన ఇటుకల దాటికి కిటికీల అద్దాలు ముక్కలయ్యాయి. అదృష్టవశాత్తూ ఈ దాడుల్లో ఆలయం లోపల ఉన్న వారెవరికీ గాయాలు కాలేదని, అయినప్పటికీ.. భయాందోళనలకు గురయ్యారని హిందూ అమెరికన్ ఫౌండేషన్ వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే రిచ్‌మండ్ హైట్స్ పోలీస్ యంత్రాంగం, ఓహియో స్టేట్ ఎఫ్‌బీఐ సివిల్ డివిజన్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.

చర్లపల్లి నుంచి అరుణాచలానికి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు
చర్లపల్లి నుంచి అరుణాచలానికి ప్రత్యేక రైళ్లు.. ఏపీలో హాల్ట్ స్టేషన్లు

ఆలయ ప్రాంగణంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిశితంగా పరిశీలిస్తోన్నారు. నిందితులను త్వరితగతిన పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఆలయ నిర్వాహకులకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందిస్తోన్నామని హిందూ అమెరికన్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. ఈ నెల 1 వ తేదీ నుంచి అమెరికా వ్యాప్తంగా హిందూ హెరిటేజ్ మంత్ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. శరన్నవరాత్రి వేడుకల కోసం భక్తులు సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ దుశ్చర్య జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ దాడిని కోయెల్షన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా ఖండించింది. రిచ్‌మండ్ హైట్స్ మేయర్ కిమ్ థామస్‌, ఇతర అధికారులు ఈ వివక్షాపూరక దాడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అమెరికాలోని హిందూ సమాజంపై పెరుగుతున్న వ్యతిరేకత, ద్వేషపూరిత ప్రసంగాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు భద్రత చర్యలు చేపట్టాలని, హిందువులకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+