షీర్ కుర్మా.. ఇలా చేస్తే సూపర్ రుచి.. మళ్ళీ మళ్ళీ కావాలంటారు!

సన్న సేమ్యాతో చేసే షీర్ కుర్మా.. ఇది ముఖ్యంగా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ఎక్కువగా చేసే రుచికరమైన సాంప్రదాయకమైన స్వీట్. పర్షియన్ భాషలో షీర్ అంటే పాలు అని, కుర్మా అంటే ఖర్జూరం అని అర్థం. చిక్కటి పాలతో, నెయ్యిలో రోస్ట్ చేసిన సేమియా వేసి, డ్రై ఫ్రూట్స్ మరియు ఖర్జూరపండ్లు కలయికతో చేసే ఈ పాయసం తినడానికి చాలా బాగుంటుంది. ఈ షీర్ కుర్మా తయారీ తెలుసుకుందాం.

తయారీకి కావలసిన పదార్థాలు

చిక్కటి పాలు ఒక లీటరు
సన్న సేమ్యా: అర కప్పు
చక్కెర: అరకప్పు
నెయ్యి ; మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్లు
మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ : అరకప్పు( జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, సారపప్పు, ఖర్జూరం సన్నగా తరిగినవి)
యాలకుల పొడి: 1 స్పూన్
కుంకుమపువ్వు: కొద్దిగా
రోజ్ వాటర్: 1 టీ స్పూన్

sheer kurma sweet how to make sheer kurma sweet it is tasty and delicious when you make in this process

తయారీ విధానం

ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేడి చేసి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసి వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే మరికొంత నెయ్యి వేసుకుని సన్న సేమ్యా ను వేసి సిమ్ లో పెట్టి గోల్డెన్ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి సిమ్ లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి.

ఇలా చేస్తే సూపర్ టేస్ట్

ఆ తర్వాత ఒక మందపాటి పాన్ లో లీటర్ పాలు పోసుకుని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత అందులో చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఆపై వేయించి పెట్టుకున్న సన్న సేమ్యా ను యాడ్ చేయాలి. అందులో యాలుకల పొడి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి, కుంకుమపువ్వు, రోజ్ వాటర్ వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన షీర్ కుర్మా రెడీ అవుతుంది.

అందరూ ఇష్టంగా తినే స్వీట్

ఇది చల్లబడే కొద్ది చిక్కబడుతుంది. కాబట్టి పలుచగా ఉన్నప్పుడే దీనిని ఆఫ్ చేసుకోవాలి. వేయించిన సన్న సేమ్యా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదు. అలా ఉడికిస్తే షీర్ కుర్మా టేస్ట్ మారుతుంది. తక్కువ సమయంలో ఇంటికి వచ్చిన అతిథులకు సంతోషం కలిగించే ఈ స్వీట్ ను తయారుచేసి పెట్టండి. కచ్చితంగా అందరూ ఇష్టంగా తింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+