నేడు గురు ఆదిత్య రాజయోగం ప్రభావంతో వీరికి కాసుల పంట!

వేద జ్యోతిష్య శాస్త్రంలో జులై 19 ఆదివారం ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జాతకాలను ప్రభావితం చేస్తుంది. నేడు సూర్యుడు, గురుడు కర్కాటక రాశిలో శుభప్రదమైన స్థితిలో ఉన్నారు. నేడు గురు ఆదిత్య రాజయోగం కొనసాగుతుంది. ఈ సమయం గురువు యొక్క శుభదృష్టి ఉంటుంది.

నేడు గ్రహాల స్థితి ఇలా

చంద్రుడు కన్యా రాశిలోను, కుజుడు వృషభ రాశిలోనూ, బుధుడు వక్రగతి లో మిధున రాశి లోనూ సంచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ద్వాదశ రాశుల వారి జాతకాలలో కొందరికి అదృష్టం కలిసి వస్తే, మరికొందరికి ప్రతికూలతలు వస్తాయి. నేడు ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉందో ప్రస్తుతం తెలుసుకుందాం.

Today Rashiphalalu Daily Horoscope for July 19 know about luck and unluck to these zodiac signs

మేషరాశి

మేష రాశి వారికి నేడు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఎంతోకాలంగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. కార్యాలయంలో పనిచేసే వారికి బాధ్యతలు పెరుగుతాయి. అనవసరపు చర్చలకు దూరంగా ఉంటే మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడుల జోలికి వెళ్లకుండా ఉంటే ఇవాళ మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సోదర సోదరీమణుల నుండి ఆశించిన మద్దతు లభిస్తుంది.

మిధున రాశి

బుధుడి వక్ర సంచారం వల్ల మిధున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కర్కాటక రాశి

గురు ఆదిత్య యోగంతో కర్కాటక రాశి వారికి నేను బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి . ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు పొందుతారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.

సింహరాశి

ధన స్థానంలో చంద్రుడు సంచారం చేయడం వల్ల సింహ రాశి వారికి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. వీరి మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

కన్యారాశి

కన్య రాశి లోని చంద్రుడు సంచారం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి.

తులారాశి

తులా రాశి జాతకులకు ఆదాయానికి మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కనుక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆశించిన ఫలితాలు రావడం కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులు ప్రభావవంతమైన వ్యక్తుల పరిచయం వల్ల పనులు సులభంగా పూర్తి చేసుకుంటారు. వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.

ధనుస్సు రాశి

ధనస్సు రాశి జాతకులు పై అధికారుల మన్ననలు పొందుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులను చూస్తారు. కొత్త వ్యాపార ఆలోచనలు ఫలించే సమయం ఇది. కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకర రాశి

మకర రాశి జాతకులు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. దూర ప్రయాణాలు వీరికి అనుకూలంగా మారతాయి. తండ్రి వైపు నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలను చూస్తారు.

కుంభరాశి

కుంభ రాశి వారికి నేడు కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా ఆహార నియమాల విషయంలో శ్రద్ధ వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉంటే మంచిది.

మీనరాశి

మీన రాశి వారికి నేడు భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. విందులు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+