స్పీకర్ కీలక నిర్ణయం.. ఠాక్రేకు షాక్.. శివసేనలోకి ఆరుగురు రెబల్ ఎంపీలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరుగురు శివసేన(UBT) ఎంపీలు శివసేన(షిండే) లో విలీనానికి ఆమోదం తెలిపారు. దీంతో లోక్ సభలో ఈ పార్టీ బలం 13 కు పెరిగింది. దాంతో పాటు టీఎంసీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన 20 మంది ఎంపీలకు లోక్ సభలో ప్రత్యేక సీట్లు కేటాయించడానికి కూడా తాజాగా స్పీకర్ ఆమోదం తెలిపారు.
తాజాగా స్పీకర్ నిర్ణయంతో ఏక్ నాథ్ షిండే శివసేన ఎంపీల బలం మరింతగా పెరిగినట్లుగా భావించవచ్చు. తద్వారా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంఖ్యాబలం లోక్ సభలో పెరుగుతోంది. లోక్ సభలో ఉద్ధవ్ వర్గానికి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉండగా, షిండే శివసేనకు 13 మంది ఎంపీలు ఉన్నారు.

అటు లోక్ సభలో కాంగ్రెస్ నుంచి వేరుగా తమకు ప్రత్యేక సీట్లు కేటాయించాలన్న డీఎంకే (డీఎంకే) డిమాండ్ పై స్పీకర్ ఓం బిర్లా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్.. అధికార టీవీకే పార్టీకి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. దాంతో డీఎంకే పార్టీతో విబేధాలు వచ్చాయి.












Click it and Unblock the Notifications