లష్కరే తోయిబాకు భారీ దెబ్బ.. పహల్గామ్ దాడి సూత్రధారి హతం
జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలకు మరో కీలక విజయం దక్కింది. బుధవారం బద్గామ్ జిల్లాలోని పాలమైదాన్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాది హతమయ్యాడు. మృతుడిని మహ్మద్ ఆసిఫ్ అలియాస్ హషీమ్ మూసాగా గుర్తించినట్లు శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న చినార్ కార్ప్స్ అధికారికంగా ధృవీకరించింది. ఉగ్రవాది మృతదేహంతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
యూస్‌మార్గ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో బుధవారం ఉదయం ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా 'ఆపరేషన్ కోరాగ్' (OP KORAG) ను ప్రారంభించాయి. జాయింట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా, అనుమానిత కదలికలను గమనించిన భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో హషీమ్ మూసా హతమయ్యాడు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

2025 పహల్గామ్ దాడిలో కీలక పాత్రధారి
హతం అయిన ఉగ్రవాది హషీమ్ మూసా 2025లో పహల్గామ్‌లో జరిగిన టెర్రర్ అటాక్‌లో ప్రధాన సూత్రధారి. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దారుణ దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దాడి తరువాత, నిందితుల కోసం గాలింపు చేపట్టిన కశ్మీర్ పోలీసులు.. హషీమ్ మూసాతో పాటు మరో ఇద్దరు పాక్ లష్కర్ ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి రూ. 20 లక్షల చొప్పున రివార్డు ప్రకటించారు.
పాక్ కమాండోగా శిక్షణ.. NIA ఛార్జిషీట్‌లో పేరు
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, హషీమ్ మూసా సాధారణ ఉగ్రవాది కాదు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన అత్యంత ప్రమాదకరమైన స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) లో అతడు పారా-కమాండోగా పనిచేశాడు. అనంతరం ఉగ్రవాద సంస్థ లష్కర్‌లో చేరి కాశ్మీర్‌లో విధ్వంసం సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పహల్గామ్ దాడి కేసుపై దర్యాప్తు జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గతంలో దాఖలు చేసిన 1,597 పేజీల ఛార్జిషీట్‌లో హషీమ్ మూసా పేరును ప్రధాన నిందితుడిగా చేర్చింది. లష్కర్, దాని అనుబంధ సంస్థ TRF లతో పాటు పాకిస్థాన్ హ్యాండ్లర్ సజిద్ జట్‌లను ఈ దాడికి కుట్ర పన్నినట్లు NIA నిర్ధారించింది.
కొనసాగుతున్న భద్రతా దళాల ఆపరేషన్
హషీమ్ మూసా మృతితో లష్కరే తోయిబాకు కాశ్మీర్‌లో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అతడి మృతదేహం లభించినప్పటికీ, ఆ ప్రాంతంలో ఇతర ఉగ్రవాదులు ఎవరైనా దాక్కున్నారా అనే కోణంలో భద్రతా దళాలు తమ కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఏరివేయాలనే కృతశ్చయంతో దళాలు నిరంతరం పనిచేస్తున్నాయి.














Click it and Unblock the Notifications
