పసిడి ధరల్లో పురోగమనం
దేశంలో పసిడి ప్రియులకు బంగారం ధరలు కొంత భారంగా మారాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగాయి. మొన్నటి వరకు భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన పరిణామాలు, రూపాయి విలువలో మార్పుల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. పండుగల సీజన్ దృష్ట్యా కొనుగోలుదారులు రేట్ల కదలికలను నిశితంగా పరిశీలిస్తోన్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ వద్ద 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,48,860 లుగా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,36,445 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ. 2,25,300 వద్ద స్థిరపడింది. మంగళవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చి చూస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 770, 22 క్యారెట్లు 700, 18 క్యారెట్లు 580 రూపాయల మేర పెరిగాయి. అంతర్జాతీయ కోమెక్స్ స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 4,208.9 డాలర్ల వద్ద ట్రేడవుతూ గరిష్ట నష్టాల నుంచి కొంత రికవరీని నమోదు చేసింది.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,830, 22 క్యారెట్లు రూ. 1,36,428 వద్ద నిలిచింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,030, 22 క్యారెట్లు 1,36,611, ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,590, 22 క్యారెట్లు రూ. 1,36,208 గా రికార్డయ్యాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,710 పలకగా.. 22 క్యారెట్లు రూ. 1,36,318 వద్ద ట్రేడ్ అయింది.
వివిధ నగరాల్లో నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 14,957, 22 క్యారెట్లు - రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,470
ముంబై..
24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 14,957, 22 క్యారెట్లు- రూ. 13,710, 18 క్యారెట్లు - రూ. 11,218

Click it and Unblock the Notifications