ఇక వారికి సబ్సిడీ గ్యాస్ కట్, డెడ్ లైన్ - కమర్షియల్‌ రేటు వసూలు..!!

వంటగ్యాస్ వినియోగదారులకు బిగ్ అప్డేట్. తాజాగా ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సరఫరా ఏజెన్సీ లకు కీలక ఆదేశాలు ఇచ్చాయి. సెప్టెంబరు 30వ తేదీలోగా ఆధార్‌ ఆథెంటికేషన్‌ బయోమెట్రిక్‌ ప్రక్రియ(ఈ-కేవైసీ)ను పూర్తి చేయకుంటే.. గృహ వినియోగ సిలిండర్లకూ కమర్షియల్‌ ధర వసూలు చేయనున్నారు. దీంతో ఒక్కో గ్యాస్‌ సిలిండర్‌పై సుమారు రూ.1800 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇరాన్- అమెరికా యుద్దంతో ఎల్పీజీ సరఫరాలో సమస్యలు వచ్చాయి. క్రమేణా సరఫరా వ్యవస్థ గాడిన పడింది. కాగా.. రేపు (గురువారం) అక్టోబర్ 1వ తేదీ నుంచి మరోసారి వంట గ్యాస్ ధరల విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కాగా.. రెండు సిలిండర్ల మధ్య బుకింగ్‌ వ్యవధి ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులుగా ఉంది. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోనూ దీన్ని 45 రోజుల నుంచి 25 రోజులకు తగ్గించారు. కాగా.. సబ్సిడీ వంట గ్యాస్ సరఫరా అందుకుంటున్న వినియోగ దారులు ఈ కేవైసీ పూర్తి చేయించకుంటే సబ్సిడీ పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ- కేవైసీ చేసుకున్న గ్యాస్‌ వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని స్పష్టం చేసింది.

 ఆధార్ ఉంటే చాలు - రూ 35కే కిలో ఉల్లి..!!
ఆధార్ ఉంటే చాలు - రూ 35కే కిలో ఉల్లి..!!
lpg-kyc-consumers-failing-to-complete-kyc-may-lose-subsidy-oil-companies-key-directions

ఆయిల్ కంపెనీల తాజా ఆదేశాలతో

ఇక నుంచి నాన్‌ ఈ-కేవైసీ వినియోగదారులు ఇకమీదట మార్కెట్‌ ధరకు సిలిండర్లు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి దీన్ని అమలుచేస్తామని ప్రకటించింది. పైగా నాన్‌ ఈ-కేవైసీ వినియోగదారులకు పెద్ద సిలిండర్లు అంటే.. ఇదివరకటిలా 14.2 కిలోల సిలిండర్లు ఇవ్వకూడదని, 5- 10 కిలోల చిన్న సిలిండర్లను సరఫరా చేయాలని గ్యాస్‌ కంపెనీలు, డీలర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ- కేవైసీ చేసుకోని వినియోగదారులకు 5 కిలోలు, 10 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. వీటిని మార్కెట్‌ ధరకు అంటే కిలోకు రూ.176 చొప్పున ఇస్తారు. అంటే 10 కిలోల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.1760 చెల్లించాల్సి ఉంటుంది. ఐదు కిలోల సిలిండరకు అయితే రూ.860 కట్టాల్సి ఉంటుంది. సబ్సిడీ గ్యాస్‌ కనెక్షన్ల దుర్వినియోగా న్ని ఆరికట్టేందుకే కేంద్రం ఈ-కేవైసీని అమల్లోకి తెచ్చిందని అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+