మోడీకి సొంత రాష్ట్రంలో మరో ఝలక్..! కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం..!

వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోబోతున్న ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలిస్తున్న బీజేపీకి ఇప్పుడు బలంగా ఎదురుగాలులు వీస్తున్నాయి. తాజాగా సహకార చక్కెర కర్మాగారాల ఎన్నికల్లో బీజేపీకి మొదలైన ఎదురుదెబ్బల పర్వం ఇంకా కొనసాగుతోంది. ఇందులో భాగంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శంకర్ సింఘ్ వాఘేలా (Shankersinh Vaghela) ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయబోతున్నారు.

మోడీ ఏరికోరి తెచ్చుకున్న ఈసీ కమిషనర్ల తిరుగుబాటు ? ఎవరీ సంధూ, వివేక్ జోషీ..?
మోడీ ఏరికోరి తెచ్చుకున్న ఈసీ కమిషనర్ల తిరుగుబాటు ? ఎవరీ సంధూ, వివేక్ జోషీ..?

బీజేపీని గద్దె దింపేందుకు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు శంకర్ సింఘ్ వాఘేలా ప్రకటించారు. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న వాఘేలా అప్పటి నుంచీ కాషాయ శిబిరంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన బీజేపీ వైఖరితో విసిగిపోయి ఆ పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వాఘేలా ప్రకటించారు. "బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నేను (కాంగ్రెస్‌లో) చేరడానికి సిద్ధంగా ఉన్నాను," అని వాఘేలా 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'తో చెప్పారు. దీంతో వాఘేలా కాంగ్రెస్ లో చేరడం లాంఛనమేనని తెలుస్తోంది.

Shankersinh Vaghela Signals Congress Return Says Ready to Throw Out BJP
మరో రాష్ట్ర విభజన?- నాలుగు ముక్కలుగా- మోడీ వ్యూహం ఇదేనా?
మరో రాష్ట్ర విభజన?- నాలుగు ముక్కలుగా- మోడీ వ్యూహం ఇదేనా?

సొంత గూటికి చేరే విషయంలో గుజరాత్ వ్యవహారాల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా, గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా, మాజీ కేంద్ర మంత్రి భరత్‌సిన్హ్ సోలంకిలతో చర్చించినట్లు శంకర్ సింఘ్ వాఘేలా తెలిపారు. అయితే లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశం తర్వాతే తన పునరాగమనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్ లో వచ్చే నెలలో జరగనున్న గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వచ్చే ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. 2017లో కాంగ్రెస్‌ను వీడిన 86 ఏళ్ల వాఘేలా.. ప్రస్తుతం పార్టీ నుండి తాను ఏమీ ఆశించడం లేదని, కేవలం తన వంతు సహకారం అందించాలని మాత్రమే కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు వాఘేలా రాకతో పార్టీకి చేకూరే ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+