భారత మాజీ ప్రధాని దేవెగౌడ సతీమణి కన్నుమూత

భారత మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సతీమణి చెన్నమ్మ దేవెగౌడ (89) జూలై 18, 2026 శనివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె గుండెపోటుతో మరణించారు. ఆమె కేంద్ర మంత్రి హెచ్‌ డీ కుమారస్వామికి మాతృమూర్తి. చెన్నమ్మ మృతితో దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

చెన్నమ్మ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. " శ్రీమతి చెన్నమ్మ మృతి వార్త తెలిసి తీవ్ర విచారం కలిగింది. మాజీ ప్రధాని దేవెగౌడ గారికి, కేంద్ర మంత్రి కుమారస్వామి గారికి, నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ధైర్యం చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అటు మంత్రి లోకేష్ కూడా చెన్నమ్మ మృతిపై సంతాపం తెలిపారు.

Chennamma Deve Gowda wife of former Indian Prime Minister H D Deve Gowda passed away on July 18

ఇక హాసన్ జిల్లా హోలేనరసిపుర తాలూకా ముత్తిగె హీహళ్లిలో జన్మించిన చెన్నమ్మ.. దేవెగౌడను 1954 లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కమార్తెలు. అలాగే పలువురు మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కుమారులు హెచ్‌ డీ కుమారస్వామి కేంద్ర మంత్రి కాగా, హెచ్‌ డీ రేవన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2001 ఫిబ్రవరిలో జరిగిన కుటుంబ గొడవల సమయంలో చెన్నమ్మ యాసిడ్ దాడికి గురయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+