భారత్ కు సడెన్ షాక్ ఇచ్చిన పాకిస్థాన్.. రూ. వందలకోట్లు నష్టం..

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఘటన వెనక ఉన్నది పాకిస్థాన్ అని తేలిన నేపథ్యంలో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే ఆ దేశంపై పలు కఠినమైన ఆంక్షలు విధించింది. అటు పాకిస్థాన్ సైతం భారత్ పై ఆంక్షలు పెట్టింది.

అయితే తాజాగా మరోసారి భారత్ పై కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్. భారత విమానాలు, మిలిటరీ విమానాలు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా విధించిన ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును ఆగస్టు 23 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాకిస్థాన్ కు చెందిన ఎయిర్ పోర్ట్స్ అథారిటీ నోటీస్ టూ ఎయిర్ మెన్ జారీ చేసింది.

గతంలో విధించిన ఆంక్షలు జూలై 24 న ముగియగా.. మరోసారి నెల రోజులపాటు భారత విమానాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇది ఒక రకంగా భారత్ కు నష్టం అని చెప్పాలి. ఎందుకంటే పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసి వేయడం కారణంగా భారత విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల అధిక ఇంధనం ఖర్చు అవుతుంది. ఈ విధానం భారతీయ ఎయిర్ లైన్స్ కు భారీగా నష్టాలను మిగుల్చుతోంది. ఇప్పటికే ఈ ఆంక్షలు ఏడాదిగా కొనసాగుతున్నాయి. దాంతో భారతీయ ఎయిర్ లైన్స్ వందల కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. చివరకు ఆ భారం ప్రయాణికులపైనే పడుతోంది.

pakistan extends closure of airspace for Indian flights until August 23 Pakistan india airspace

అటు భారత్ కూడా పాకిస్థాన్ విమానాలను తన గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. పాకిస్థాన్ కు చెందిన ఎయిర్ లైన్స్ ఆపరేటింగ్ చేస్తున్న విమానాలు, మిలిటరీ ప్లేన్ లకు భారత్ తన గగనతలాన్ని క్లోజ్ చేసింది. దాంతో పాకిస్థాన్ కు చెందిన విమాన సంస్థలు కూడా నష్టాన్ని చవిచూస్తున్నాయి. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగితే ఈ ఆంక్షలను ఇరు దేశాలు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+