బలిసిన ఎలుకలకే సపోర్ట్.. సుమలతపై సత్య మాస్టర్ ఫైర్

తెలుగు సినీ, టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో రేగిన వివాదం అనూహ్య మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ సతీమణి సుమలతను డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవితో పాటు మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేస్తూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుమలత పోలీసులను ఆశ్రయించి కేసుల వరకువెళ్లారు. దాంతో సీనియర్ కొరియోగ్రాఫర్లు రఘు మాస్టర్, సత్య మాస్టర్, అజయ్ మాస్టర్, రాజన్న మాస్టర్‌లు శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసోసియేషన్‌లో జరుగుతున్న పరిణామాలతో పాటు సుమలతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

23వ తేదీన జరిగిన జనరల్ బాడీ సమావేశం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగింది. అంతకుముందు సుమలత గారిని, మనలో కొంతమందిని పిలిపించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్ చాలా బాగా జరిగింది. చాలామంది ఎవరి సమస్యలను వారు తెలియజేశారు. సభ్యులంతా జనరల్ ఎలక్షన్స్ కావాలని కోరుకున్నారు. దీని ప్రకారమే డ్యాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని రద్దు చేసి ఎన్నికలు జరిపించాలని ఫెడరేషన్ నిర్ణయించింది. అక్టోబర్ 11న ఎన్నికలు జరుగుతాయి.. మీటింగ్ అంతా ముగిసి సెక్రటరీగారు మినిట్స్ బుక్ తీసుకుని వెళ్తుండగా సుమలత గారు వచ్చి ఆ బుక్ కావాలని తీసుకుని వెళ్లిపోయారని రఘు మాస్టర్ తెలిపారు.

Telugu Dancers Association Row Raghu Master and Satya Master Make Serious Allegations Against Sumalatha

ఆడవాళ్ల మీద మాట తూలడం లాంటివి చేయకూడదు కాబట్టి.. అసోసియేషన్‌లో ఉన్న అమ్మాయిలే వెళ్లి సుమలతను అడ్డుకున్నారు. అది తోపులాటలా జరిగింది, దానిపై ఆమె కేసుల వరకు వెళ్లారు. ఆవిడ ఎన్నికలు జరగనిస్తారా? కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటారా అనేది తెలియదు. మేం కూడా కోర్టుకు వెళ్లగలం.. కానీ ఫెడరేషన్‌పై గౌరవంతో వారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. యూనియన్‌లో ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.. ఇక్కడ ఎవరి వర్గం లేదు, యూనియన్‌కి మంచి చేయాలనే ఉద్దేశం ఉన్నవారు పోటీ చేయొచ్చు అని రఘు మాస్టర్ చెప్పారు.

కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నామంటే మేం న్యాయస్థానాన్ని ధిక్కరించలేం. యూనియన్‌కు సంబంధించిన బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయడానికే మేం బ్యాంక్‌కి వెళ్లాం. అకౌంట్‌ని ఫ్రీజ్ చేస్తే ఈ వ్యవహారాలన్నీ ఆగిపోతాయి.. ఎవరు క్లారిటీతో వస్తారో అప్పుడే మళ్లీ రీ ఓపెన్ చేయమని అడిగాం. దానికి ఆమె పెట్టిన పేరు ఫోర్జరీ.. దీనిపై పోలీసులకు వివరణ కూడా ఇచ్చాం. మా 9 మందిపై సుమలత ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. కానీ మేం సభ్యులకు ఎలాంటి కష్టమొచ్చినా ఎదుర్కొంటాం. జనరల్ బాడీయే సుప్రీం.. అందరిని పిలిచి మాట్లాడారు అని రఘు మాస్టర్ తెలిపారు.

డ్యాన్సర్స్ అంతా కోరుకున్న విధంగా ఎన్నికలు జరిగి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రఘు మాస్టర్ వద్దు, సుమలత గారు కూడా వద్దు.. జనరల్ ఎలక్షన్స్ కావాలనే నేను కూడా చెబుతున్నా. వాళ్లు కూడా ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే హ్యాపీయే. డ్యాన్సర్స్ వెనుక శేఖర్ మాస్టర్ లేడు.. రఘు మాస్టర్ లేడు, మేం శాసిస్తే ఆగిపోవడానికి ఇది యూనియన్. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు అందరూ వచ్చి మమ్మల్ని ఓట్లు అభ్యర్ధించేవారు. యూనియన్‌లో పదవులు కావాలనుకుంటే ఎప్పుడో వచ్చేవి.. అలాగే రాజకీయాలు కావాలనుకుంటే ఇందులో ఎందుకు బయటే చూసుకునేవాళ్లమని రఘు మాస్టర్ స్పష్టం చేశారు.

సత్య మాస్టర్ మాట్లాడుతూ.. ఒక యూనియన్ కి సంబంధించిన ఇంటి సమస్య బజారున పడింది. ఒక అసోసియేషన్ లో 600 మంది డాన్సర్స్ ఉన్నారు.. ఇందులో నాలుగు అవినీతి ఎలుకలు వున్నాయి.. ఈ నాలుగు ఎలుకల గురించి ఇల్లు తగల పెడదాము అంటే ఎలా? ప్రెసిడెంట్ గా ఉన్న సుమలత సరైన నిర్ణయాలు తీసుకోవాలి.. బలిసిన ఒక ఎలుకని వాళ్లే సపోర్ట్ చేస్తున్నారు. అసోసియేషన్‌ని లేకుండా చేద్దామని చూస్తున్నారు అందుకే మేము మాట్లాడాల్సి వస్తోంది. సుమలత విభజించి పాలిస్తున్నారు కాబట్టే ఈ సమస్యలు వచ్చాయి... మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో సుమలత మనుషులు వచ్చి మైకు లాక్కున్నారు.. చాలా మంది మాట్లాడాలంటేనే భయపడే పరిస్ధితి ఉందన్నారు.

యూనియన్ కి ప్రాబ్లెం వస్తే మేము కచ్చితంగా మాట్లాడతాము.. రిటైర్ అయినా వాళ్లను వెంటేసుకోని మా సభ్యులతో కావాలని గొడవ పడుతున్నారు. సుమలత గారు మొన్న బాడీ మీటింగ్ లో ఆమె మినిట్స్ బుక్ లాక్కొని ప్రయత్నం చేశారు. గొడవ జరుగుతుందని మేం వెళ్తే మాపై కేసులు పెట్టారు. సభ్యుల నిర్ణయం మేరకు అక్టోబర్ 11న ఎలక్షన్స్‌కి వెళుతున్నాము.. డాన్సర్స్‌కి న్యాయం కోసం ఎలక్షన్స్ జరగాలని సత్య మాస్టర్ కోరారు. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారగా.. దీనిపై సుమలత, జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+