అమిత్ షాకు షాక్..నిలదీసిన సొంత ఎంపీ..!
ఐజ్వాల్: మణిపూర్ హింసాత్మక ఘటనలు పార్లమెంట్ ఉభయసభల్లో మంటపుట్టిస్తున్నాయి. ఇప్పటికే లోక్‌సభలో విపక్షాలు మోదీ సర్కార్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి ఓటింగ్ కూడా ముగిసింది. మణిపూర్ అంశంపై ఎన్డీయేలోనే చీలిక వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఎన్డీయేకు మద్దతు ఇస్తున్న ఎంపీలు మణిపూర్ అంశంలో మాత్రం మోదీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు.
మిజోరాం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఎంపీ వన్లాల్‌వేనా మణిపూర్ అంశంపై గళమెత్తారు. మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ నేత అయిన వన్లాల్‌వేనా పార్లమెంట్‌లో అమిత్ షా చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిజో నేషనల్ ఫ్రంట్ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. మణిపూర్ గిరిజనులు మయన్మార్ జాతీయులని అమిత్ షా చేసిన ప్రకటనపై వన్లాల్‌వేనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మణిపూర్ గిరిజనులు ఈశాన్య భారతంలో గత 200 ఏళ్లుగా నివసిస్తున్నారని ఎంపీ వన్లాల్‌వేనా స్పష్టం చేశారు.తను కూడా మిజోరాంకు చెందిన గిరిజనుడినని చెప్పుకుంటా తానేమీ విదేశీయుడిని కాదని అన్నారు.తాము భారతీయులమే అని స్పష్టం చేశారు.భారత్‌కు స్వాతంత్య్రం రాక ముందు నుంచి తామంతా ఈశాన్య ప్రాంతంలోనే ఉన్నట్లు వెల్లడించారు. కొన్ని శతాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్నట్లు చెప్పారు.
ఈ విషయం చెప్పగానే రాజ్యసభ ఛైర్మెన్ జగదీప్ ధన్‌కర్ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు.ఇది సున్నితమైన అంశంగా ధన్కర్ పేర్కొన్నారు.ఆ తర్వాత ప్రముఖ జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ జరిగిన విషయం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతున్న సమయంలో మైక్‌ను కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గళాన్ని వినిపించకుండా చేశారని ఆరోపించారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్టాండ్‌నే అమిత్ షా కూడా తీసుకున్నారంటూ ఆరోపించారు.












Click it and Unblock the Notifications