నాలుగు తరాలొచ్చినా సరే అది అసాధ్యం..రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్
జార్ఖండ్ రాష్ట్రంలో పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దృష్టి సారించింది. గత ఎన్నికల్లో తృటిలో చేజారిన విజయాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేసింది. అట్టడుగు స్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలతో సన్నిహిత బంధాన్ని ఏర్పరచుకుంటూ స్థానికంగా బలంగా మారుతోంది. కార్యకర్తలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేస్తోంది. ఈక్రమంలోనే జాతీయస్థాయి నేతలు జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రమంత్రి హొంమంత్రి అమిత్ షాతో పాటు,ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సోమవారం జార్ఖండ్‌లో పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370ని మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ''కాశ్మీర్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. ఆర్టికల్ 370ని మీరు (రాహుల్ గాంధీ) కాదు కదా.. మీ నాలుగో తరం కూడా తిరిగి తీసుకురాలేదు" అని షా హెచ్చరించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లను సైతం అమలు చేయనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని, అందులో ప్రయాణిస్తున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఆ పార్టీ కాపాడలేదన్నారు. చొరబాటు దారులు భూమిని అక్రమంగా లాక్కోవడానికి గిరిజన మహిళలను పెళ్లిచేసుకుంటున్నారని, అలాంటి వారికి భూమి బదలాయింపును నిలిపివేసేలా చట్టం తీసుకొస్తామన్నారు. కబ్జాకు గురైన భూమిని గిరిజనులకు తిరిగి ఇస్తామని చెప్పారు. జార్ఖండ్ లో గిరిజన జనాభా భారీగా తగ్గుతోందని ఆరోపించారు.

జేఎంఎం-కాంగ్రెస్ ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప.. వారిని గౌరవించడంలేదని ధ్వజమెత్తారు. ఓబీసీలు, గిరిజనులు, దళితుల నుంచి రిజర్వేషన్లను లాక్కోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఆ రిజర్వెషన్లనుమైనారిటీలకు ఇవ్వాలని యోచిస్తోంది. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఇక.. అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం' అని అన్నారు.మరోవైపు గర్వాలోని భవన్‌పూర్‌లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. చొరబాట్లను జేఎంఎం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని సహజ సంపదను జేఎంఎం ప్రభుత్వం దోచుకుందని తెలిపారు. సోమవారంతో జార్ఖండ్ తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.












Click it and Unblock the Notifications