బీహార్‌లో బీజేపీ అభ్యర్థిపై కర్రలతో దాడికి యత్నించిన ప్రజలు (వీడియో )

ప్రజలకు కోపం వస్తే ఎంతటి వాడైన బలి కావాల్సిందే..మరి ఎన్నికల్లో అయితే వారు చెప్పిందే వేదం..లేదని తిరగబడితే దెబ్బలు ఖాయం..ఈనేథ్యంలోనే ప్రజలు నాయకుల పని పడదామా అని ఎదురు చూస్తారు..ఎన్నికలకు మందు తమ గ్రామానికి రాకపోయిన కిమ్మనకుండా ఊరుకుంటారు..ఇక ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో నాయకులు గ్రామాలకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడు నాయకున్ని బట్టి ప్రజల ట్రీట్ మెంట్ ఉంటుంది.

తాజాగా నేడు జరిగిన ఆరవ విడత ఎన్నికల్లో భాగంగా అదే జరిగింది. ఓ ప్రధాన పార్టీ అభ్యర్ధిపై దాడికి పెద్ద పెద్ద కర్రలతో దాడికి యత్నించారు. బిహార్ లోని వెస్ట్ చంపారన్ పార్లమెంట్ ఎంపీ ప్రస్థుత బీజేపీ అభ్యర్థి అయిన సంజయ్ జైస్వాల్ పైన గుర్తుతెలియని స్థానికులు పోలింగ్ బూత్ అవతల దాడికి పాల్పడ్డారు. బూత్ నెంబర్ 162,163 వద్ద రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారం జైస్వాల్ అక్కడికి చేరుకున్నారు. దీంతో పెద్ద పెద్ద కర్రలతో ఆయన పై దాడికి ప్రయత్నించారు. అక్కడే పోలీసులు ఉండడంతో గాల్లోకి కాల్పుల జరిపారు.అనంతరం సంజయ్ జైస్వాల్ ను తీసుకెళ్లారు. అయితే ఆయనకు ఎలాంటీ గాయాలు కాలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

 An attack on Sanjay Jaiswal BJP candidate in bihar

ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం స్పికర్ కోడేల శివప్రసాద్ పై కూడ ఇదే పద్దతిలో ప్రజలు తిరగపడ్డారు. ఆయన వాహానం వెంబడి పరుగులు పెట్టిన సంగతి తెలిసిందే..పోలీసుల బందోబస్తుతో స్పీకర్ కోడేల ఊరు అవతలికి వెళ్లారు..కాసేపు తనని ఏం చేస్తారో చేయండి అంటూ పోలీంగ్ బూత్ లో బైఠాయించిన సీన్ మారడంతో కోడేల అక్కడ నుండి వెళ్లిపోక తప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+