హనీమూన్ మధ్యలో అలిగి వెళ్లిపోయాడు
న్యూఢిల్లీ/లక్నో: కొత్త దంపతులు హనీమూన్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. తరువాత చిన్న విషయంలో గొడవపడి వరుడు మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన విచిత్ర సంఘటన బీహార్ లోని పాట్నలో జరిగింది. విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు విమానాశ్రయ అధికారుల మీద మండిపడుతున్నారు.
హనీమూన్ మధ్యలో వరుడు వెళ్లిపోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన యువతి, యువకుడికి వివాహం అయ్యింది. హానీమూన్ యాత్రలో భాగంగా ఇద్దరూ గోవాకు వెళ్లారు.

తరువాత వేరే ప్రాంతానికి బయులుదేరారు. ఇద్దరూ గురువారం ఇండిగో 6E 633 విమానంలో లక్నోకు బయలుదేరారు. ఆ సందర్బంలో ఇద్దరి మద్య చిన్న విషయంలో గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో వరుడికి కోపం వచ్చింది. విమానం మార్గం మద్యలో పాట్నాలో అగింది.
విమానం నిలపడం ఆలస్యం వరుడు చిన్నగా విమానం దిగి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ప్రయాణికుడు గమ్యం చేరుకునే వరకు మధ్యలో దిగి వెళ్లడానికి విమానాశ్రయం అధికారులు అనుమతించరు. ఇప్పుడు వరుడు పారిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు అధికారుల మీద మండిపడుతున్నారు.
ఈ విషయంపై ఇండిగో విమాన సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ విమానం గమ్యస్థానం చేరక ముందే ఇలా మధ్యలో దిగిపోయే ప్రయాణికులు చాల అరుదుగా ఉంటారని వ్యాఖ్యానించారు. అయితే వధూవరుల వివరాలు వెల్లడించడానికి విమానాశ్రయ అధికారులు నిరాకరించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications