వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌కు చేదు: హజారే ఫాలోవర్ ఇంక్‌తో వ్యక్తి దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anna follower flings black paint at Arvind Kejriwal
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా ఆయనపై ఓ వ్యక్తి నల్ల ఇంకు చల్లాడు. కేజ్రీవాల్‌‍కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ఆయన పక్కనే ఉన్న మనీష్ శిశోడియా, ప్రశాంత్ భూషణ్, సంజయ్ సింగ్‌లపై కూడా ఇంక్ పడింది. ఎఎపి వాలంటీర్లు ఆయనను అక్కడి నుండి పంపించారు.

కాగా, ఇంక్ చల్లిన వ్యక్తిని నచికేతా వాఘ్రేకర్‌గా గుర్తించారు. తాను అన్నా హాజరే మద్దతుదారుడినని, అహ్మద్ నగర్ బిజెపి శాఖ ప్రధాన కార్యదర్శినని చెప్పారు. గురువైన హజారేకు కేజ్రీవాల్ వ్యతిరేకిగా మారారని వాఘ్రేకర్ ఆరోపించారు. కాగా, ఇంక్ వేసిన వ్యక్తి బిజెపి ఐటి విభాగానికి చెందిన వ్యక్తి అని ఎఎపి ట్విట్టర్‌లో ఆరోపించింది.

కాగా, ఢిల్లీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ఎదురుచూస్తున్న బిజెపిని దేవుడు కూడా కాపాడలేడని, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభావం రాష్ట్ర శాసనసభ ఎన్నికలపై పెద్దగా ఉండబోదని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. 'ఢిల్లీలో బిజెపిని దేవుడు కూడా రక్షించలేడు. ఇక ఆ పార్టీని మోడీ ఏం రక్షించగలడు?' అని కేజ్రీవాల్ సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ప్రశ్నించారు.

తనకు పరిపాలన అనుభవం ఏమాత్రం లేదని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ ఘాటుగా ప్రతిస్పందించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు షీలా దీక్షిత్‌కు మాత్రం పరిపానలో పూర్వానుభవం ఉందా? అని ప్రశ్నించారు. అయినప్పటికీ తాను సమర్థుడైన అభ్యర్థినన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీయే గుర్తించిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌కు నోటీసు

జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించేందుకు తాము అధికారంలోకి వచ్చాక రాంలీలా మైదానంలో బహిరంగంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలకు సంబంధించి ఢిల్లీ శాసన సభ హక్కుల ఉల్లంఘన నోటీసును పంపించింది.

English summary

 A man claiming to be a BJP worker and an 'Anna bhakt' (follower) created a flutter on Monday by flinging a box of black paint at AAP leaders, including its chief Arvind Kejriwal, and alleging that they had siphoned off money collected during Anna Hazare's campaign against corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X