అనుచిత వ్యాఖ్యలు: యూపీ సీఎం యోగీపై ఈసీకి మాజీ నేవీ ఛీఫ్ ఫిర్యాదు
ఢిల్లీ: భారత ఆర్మీని మోడీ సేనగా అభివర్ణించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు మాజీ నేవీ ఛీఫ్ అడ్మిరల్ రామ్‌దాస్. భారత దేశంలోని త్రివిధ దళాలు ఒక వ్యక్తికి కానీ ఒక రాజకీయపార్టీకి కానీ సంబంధించినవి కావని ఆయన అన్నారు. త్రివిధ దళాలపై అనుచిత వ్యాఖ్యలు ఎవరి చేసినా అవి ఆమోదయోగ్యం కాదని అన్నారు. తాను ఎన్నికల ప్రధాన అధికారికి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖను సమర్పించారు.

గత నెలలో కూడా రామ్‌దాస్ ఎన్నికల సంఘానికి ఓ ఫిర్యాదు ఇచ్చారు. త్రివిధ దళాల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు రాజకీయాల కోసం భారత సైన్యం చేపట్టిన దాడులను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించుకోరాదంటూ ఎన్నికల సంఘం చెప్పడాన్ని రాందాస్ అభినందించారు.
ఆదివారం ఘజియాబాదులో జరిగిన ఓ ర్యాలీలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పుల్వామా దాడుల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులకు బిరియాని తినిపించారని అదే మోడీ హయాంలో మోడీ సైనికులు బుల్లెట్లు, బాంబులును ఉగ్రవాదులకు తినిపించారని చెప్పారు. ఇదే కాంగ్రెస్‌కు బీజేపీకి ఉన్న తేడా అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఉగ్రవాదులను గౌరవంగా కాంగ్రెస్ సంబోధిస్తోందంటూ జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను రాహుల్ గాంధీ మసూద్ గారు అని పిలవడాన్ని ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడమే కాదు పాక్ భరతం కూడా పడుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications