సిద్ధూకు ఎలాంటి షరతులు విధించలేదు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధుకు ఎలాంటి ముందస్తు షరతులను తాము విధించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని కోరిన సిద్ధూకు ఏఏపీ నుంచి చుక్కెదురైందని, ఒక కుటుంబం నుంచి ఒకరికే టిక్కెట్ ఇస్తామని ఏఏపీ షరతులు విధించిందని వార్తలు వచ్చాయి. దీంతో సిద్ధూ ఏఏపీలో చేరే అంశంపై పునరాలోచనలో పడ్డారని పుకార్లు షికార్లు చేశాయి.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం ట్విట్టర్ ద్వారా స్పందించారు. సిద్ధూ చేరికపై పార్టీ అభిప్రాయం ఏమిటో తెలియజేయడం తన బాధ్యత అన్నారు. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. అలాగే సిద్ధూ ఆలోచించుకునేందుకు కూడా కొంత సమయం అవసరమన్నారు.












Click it and Unblock the Notifications