కేజ్రీకి మళ్లీ చెంపదెబ్బ, ఈసారి ఆటో డ్రైవర్: ఎందుకిలా!?

మంగళవారం కేజ్రీవాల్ రోడ్డు షో నిర్వహించారు. కేజ్రీవాల్ పార్టీ అభ్యర్థి రాఖీ బిర్లా తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కేజ్రీవాల్ చెంప పైన కొట్టాడు. అతనిని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు చితకబాదారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు అతనికి భద్రతను ఇస్తున్నారు. కేజ్రీవాల్ నిత్యం భద్రతాధికారుల సూచనలను పట్టించుకోవడం లేదట. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలోని దక్షిణపురిలో రోడ్డుషో సందర్భంగా కేజ్రీవాల్ పైన ఓ వ్యక్తి పిడిగుద్దు కురిపించిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్ పైన దాడికి ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షాలను బాధ్యులను చేస్తోంది. ప్రధానంగా బిజెపి పైన ఎఎపి నెపం నెడుతోంది. కాగా, వరుసగా తన పైనే దాడి జరుగుతుండటంపై, ఇంక్ వేస్తుండటంపై కేజ్రీవాల్‌తో పాటు ఎఎపి ఆశ్చర్యపోతోందట!












Click it and Unblock the Notifications