కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: సీనియర్ నేత, మాజీ ఎంపీ సుష్మితా దేవ్ రాజీనామా

గౌహతి: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అస్సాం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎంపీ సుష్మితా దేవ్ పార్టీకి రాజీనామా చేశారు. అస్సాం ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె.. సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తనకు ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు పార్టీ నేతలందరికీ ఆమె తన రాజీనామా లేఖలో ధన్యవాదాలు తెలిపారు.

ట్విట్టర్‌లో కూడా తనను తాను మాజీ కాంగ్రెస్ నాయకురాలిగా పేర్కొన్నారు సుష్మితా దేవ్. గత మార్చిలోనే సుష్మితా దేవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె అప్పుడు పార్టీని వీడలేదు. తాజాగా, ఆమె కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఘోర ఫలితాలు తనను అసంతృప్తికి గురిచేశాయని తెలిపారు.

 Assam: Congress Senior leader Sushmita Dev Quits Party.

సుష్మితా దేవ్ ఎందుకు రాజీనామా చేశారో తెలియడం లేదని, ఆమెకు పార్టీలో తగిన గౌరవం ఇచ్చామని అస్సాం కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఆమె పార్టీకి రాజీనామా చేయలేదని కూడా కొందరు నాయకులు చెబుతున్నారు. అయితే, ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్ పార్టీ సీట్లను పంచుకోవడం ఆమె అసంతృప్తి ఉన్నారని మరికొందరు నేతలు తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే రూప్ జ్యోతి కుర్మి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు.

కాగా, సుస్మితా దేవ్‌ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్‌ చీఫ్‌గా కూడా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సుస్మితా దేవ్‌ త్వరలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సుస్మితా దేవ్‌ సోమవారం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీతో కానున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీని సీనియర్ నేతలు వీడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత కపిల్ సిబల్ తీవ్రంగా స్పందించారు. 'సుస్ముతా దేవ్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. యువ నాయకులంతా పార్టీని వీడితున్నారు.. పార్టీని బలోపేతం చేయడానికి మేం సరిగా ప్రయత్నించడం లేదంటూ వృద్ధులపై నిందలు వేస్తున్నారు' అంటూ కపిల్‌ సిబాల్‌ విమర్శించారు.

సుస్మితా దేవ్ రాజీనామా గురించి తనకు తెలియదని అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ బోరా పేర్కొనడం గమనార్హం. సుస్మితా దేవ్ అసోం కాంగ్రెస్ నాయకుడు ప్రభావవంతమైన బెంగాలీ నాయకుడు సంతోష్ మోహన్ దేవ్ కుమార్తె. సుస్మితా దేవ్ గతంలో తన తండ్రికి పట్టున్న సిల్చార్ సీటు నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు.

కాగా, కాంగ్రెస్​పార్టీ నాయకత్వ సంక్షోభం మళ్లీ తెర మీదకు వచ్చింది. పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండొచ్చనే చర్చల మధ్య.. మరికొందరు కాంగ్రెస్​ సీనియర్​ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. మరోవైపు పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయాల్సిందేనని సోనియా గాంధీకి జీ 23 అసమ్మతి నేతలు గతంలోనే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్ మరోసారి కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్రంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+