2కార్లను ఢీకొట్టి లోయలోపడిన బస్సు: 17మంది మృతి
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ముంబై-పుణె జాతీయ రహదారిపై ఓ లగ్జరీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు.. రెండు కార్లను ఢీ కొట్టి లోయలో పడింది.
ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందారు. మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ఎనిమిది నెలల పసికందు ఉన్నట్లు పోలీసులు గుర్తించామన్నారు.

బస్సు, కార్లు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. సుమారు 20 అడుగుల పై నుంచి బస్సు కిందకు పడింది. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కల కారణాలతో పాటు ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications