అయోధ్య భూమి పూజ: టీవీ చానెళ్లపై ఆంక్షలు - ఆ తరహా డిబేట్లు వద్దు - ముందస్తు అనుమతి మస్ట్..
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య పట్టణంలో ఆగస్టు 5న తలపెట్టిన రామ మందిరం భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. టీవీ చానెళ్ల కవరేజీ, ప్రచారాలపై ఆంక్షలు విధించారు. మతవిశ్వాసాలతో ముడిపడిన సున్నితమైన అంశం కాబట్టి భూమి పూజ సమయంలో మీడియా సంయమనం పాటించాలంటూ అయోధ్య డిప్యూటీ కలెక్టర్ మురళీధర్ సింగ్ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు.
ప్రధానంగా, రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై పిటిషన్లు వేసిన వారిని గానీ, లేదా కేసులతో సంబధమున్న ఇతర వ్యక్తులను గానీ టీవీ చర్చల్లోకి అసలే పిలవొద్దని, ప్యానెల్ డిస్కషన్ లో ఇతర మతాల విశ్వాసాలు దెబ్బతినేలా వ్యవహరించరాదని, వ్యక్తులను టార్గెట్ చేస్తూ తీవ్ర కామెంట్లు చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆగస్టు 5న అయోధ్య నగరంలో ఆయా టీవీ చానెళ్లు చేయబోయే అన్ని కార్యక్రమాలకు కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

''ఆగస్టు 5న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేవారంతా కొవిడ్-19 ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. కార్యక్రమాల నిర్వహణకు ముందే అనుమతి పొందాలని టీవీ చానెళ్లకు ఆదేశించాం. అది కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తాం. పబ్లిక్ డిబేట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. ఏ మతం లేదా వ్యక్తిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా మీడియా జాగ్రత్త వహించాలి. కోర్టు వివాదాలున్న ఏ పక్షాన్ని కూడా చర్చకు పిలవొద్దు''అని సింగ్ పేర్కొన్నారు.
రూ.500 కోట్ల వ్యయంతో అయోధ్యలో నిర్మించనున్న భవ్య రామ మందిరానికి ఆగస్టు 5న భూమి పూజ జరుగనుంది. శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, వెండి ఇటుకలతో శంకుస్థాపన చేస్తారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 200 మంది అతిథులు ప్రధానితో కలిసి వేడుకలో పాల్గొంటారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications