వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:ఆయుధాలతో శిక్షణపై భజరంగ్ దళ్.. ఉల్లంఘన కాదట, రెగ్యులర్ ట్రైనింగ్ అట..?

|
Google Oneindia TeluguNews

కర్ణాటకలో భజరంగ్ దళ్ కార్యకర్తలకు ఆయుధాల శిక్షణ ఇస్తున్నారని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సదరు ఫోటోలు ట్రోల్ అవుతున్నాయి. దీంతో బజరంగ్ దళ్ నేత రఘు స్పందించారు. కొడగు శిక్షణ శిబిరంలో జరుగుతున్న అంశాలను వివరించారు. కార్యకర్తలకు శారీరక, మానసికంగా ఉల్లాసం కోసం శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.

ప్రైవేట్ స్కూల్‌లో శిక్షణ

ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కొడగులో గల పొన్నామ్ పేట్ ప్రైవేట్ స్కూల్‌లో శిక్షణ జరిగింది. శౌర్య వర్క్ షాప్ పేరుతో నిర్వహించిన శిబిరానికి 116 మంది కార్యకర్తలు వచ్చారు. ఉదయం 4.45 గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు శిక్షణ కొనసాగింది. కార్యకర్తలు ఎయిర్ గన్స్ ఉపయోగించి త్రిశూల్ దీక్ష ట్రైనింగ్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. దీనిపై రఘు స్పందిస్తూ.. ఇదీ ఆయుధ చట్టం ఉల్లంఘన కానే కాదు అని స్పష్టంచేశారు.

వెయిల్ లిప్టింగ్, లాంగ్ జంప్

వెయిల్ లిప్టింగ్, లాంగ్ జంప్

శిక్షణ శిబిరంలో వెయిట్ లిప్టింగ్, లాంగ్ జంప్, మంకీ రోప్.. ఇతర యాక్టివిటీస్ చేశారు. ఇప్పుడే కాదు.. ప్రతీసారి ఇలానే శిక్షణ ఇస్తామని రఘు చెప్పారు. ఎయిర్ గన్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం అతిక్రమణ కానే కాదని చెప్పారు. బజరంగ్ దళ్ కార్యకర్తల ఫోటోలు బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సందేహాం వ్యక్తం చేసింది. భజరంగ్ దళ్ దళ్ యువత ప్రాణాలను తీస్తోందని ఆరోపించారు. వారికి మతం పేరుతో శిక్షణ ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ ఆర్షద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయలేదు. తమకు ఫిర్యాదు రాలేదని వారు చెప్పారు.

అదేం లేదు

కాంగ్రెస్ ఆరోపణలు ఇలా ఉండగా.. బజరంగ్ దళ్ మాత్రం కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసింది. అయితే దీనికి సంబంధించి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెప్పడం విశేషం. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కమల దళం.. బజరంగ్ దళ్, వీహెచ్‌పీకి అనుకూలం.. అందుకే అక్కడ క్యాంపులు నిర్వహిస్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనిని బీజేపీ నేతలు ఎలా కౌంటర్ చేస్తారో చూడాలీ.

English summary
Bajrang Dal leader Raghu Sakleshpur claimed that Kodagu training camp was a workshop conducted by the group to build mental and physical resilience in Karyakartas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X