Underworld Don: గ్యాంగ్ వార్, పబ్ యజమాని కాల్చివేత, బ్రిగేడ్ రోడ్డులో కలకలం, రషీద్ గ్యాంగ్ పనే ?
బెంగళూరు/ ఉడిపి/ మంగళూరు: గ్యాంగ్ వార్ కారణంగా పబ్ ఓనర్ ను రివాల్వర్ తో కాల్చి చంపేశారు. పబ్ బయట మాట్లాడుతున్న యజమానిపై ప్రత్యర్థి ముఠా పభ్యులు కాల్పులు జరిపి సినిమా స్టైల్లో తప్పించుకుని పారిపోయారు. హత్యకు గురైన పబ్ యజమాని ఓ రౌడీషీటర్, మాఫియా డాన్ సహచరుడిగా గుర్తింపు ఉన్న వ్యక్తి కావడంతో ముఠా కక్షలు భగ్గుమన్నాయి. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే బ్రిగేడ్ రోడ్డు ప్రాంతంలోనే ఈ షూటౌట్ జరగడంతో కలకలం రేపింది.

పబ్ యజమాని మనీష్ శెట్టి
బెంగళూరు సిటీలోని బ్రిగేడ్ రోడ్డు సమీపంలోని ఆర్ హెచ్ పీ రోడ్డులో మనీష్ శెట్టి (45) అనే వ్యక్తి డ్యూయెట్ బార్ అండ్ రెస్టారెంట్ (పబ్) నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో మనీష్ శెట్టి అతని డ్యూయెట్ పబ్ దగ్గరకు వెళ్లాడు. పబ్ ముందు నిలబడిన మనీష్ శెట్టి అక్కడ పని చేస్తున్న ఉద్యోగితో మాట్లాడుతున్నాడు.

థ్రిల్లర్ సినిమా స్కెచ్
పబ్ ముందు మనీష్ శెట్టి మాట్లాడుతున్న సమయంలో బైక్ లో వెళ్లిన గుర్తు తెలియన వ్యక్తులు మనీష్ శెట్టి మీద రివాల్వర్ తో కాల్పులు జరిపి అక్కడి నుంచి సినిమా స్టైల్లో తప్పించుకుని పారిపోయారు. విషయం గుర్తించిన పబ్ ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తుపాకి తూటాలకు కుప్పకూలిపోయిన మనీష్ శెట్టిన సమీపంలోని మాల్యా ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై మనీష్ శెట్టి మరణించాడని బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ ఎంఎన్. అనుచేత్ మీడియాకు చెప్పారు.

అండర్ వరల్డ్ డాన్ బెన్నంజే రాజా శిష్యుడు
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కోప్ప ప్రాంతానికి చెందిన మనీష్ శెట్టి బెంగళూరు చేరుకుని డ్యూయెట్ పబ్ నిర్వహిస్తున్నాడు. మనీష్ శెట్టి కూడా రౌడీషీటర్. అండర్ వరల్డ్ డాన్ బెన్నంజే రాజా అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న మనీష్ శెట్టి మీద కర్ణాటకలోని ఉడిపి, మంగళూరు జిల్లాల్లో అనేక కేసులు నమోదైనాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఓ హత్య కేసులో మనీష్ శెట్టి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో ప్రత్యర్థి మాఫియా డాన్ రషీద్ మల్బారి గ్యాంగ్ డ్యూయెట్ పబ్ యజమాని మనీష్ శెట్టిని హత్య చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆ గ్యాంగ్ పనే........ క్లూ చిక్కింది
డ్యూయెట్ పబ్ యజమాని మనీష్ శెట్టిని హత్య చేసిన నిందితుల వివరాలు తెలుసుకుంటున్నామని, మాకు క్లూ చిక్కిందని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ మీడియాకు చెప్పారు. అండర్ వరల్డ్ డాన్ ల ఆదిపత్యపోరు, మామూళ్లు వసూలు చేసే విషయంలో తేడాలు రావడం వలనే పబ్ యజమాని మనీష్ శెట్టి హత్యకు గురైనాడని పోలీసు అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద అండర్ వరల్డ్ డాన్ ల గ్యాంగ్ వార్ లో బెంగళూరులోని బ్రిగేడ్ రోడ్డు సమీపంలోనే పబ్ యజమాని అతని పబ్ ముందే ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురి కావడం కలకలం రేపింది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications