వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని కార్నర్ చేసేందుకు..: బంద్‌పై లెక్కలు, కాంగ్రెస్ సీఎం ట్విస్ట్

ఓ వైపు నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అదే సమయంలో విపక్షాలు మాత్రం అన్నీ ఒక్కటి కావడం లేదు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ వైపు నోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. అదే సమయంలో విపక్షాలు మాత్రం అన్నీ ఒక్కటి కావడం లేదు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు బందుకు పిలుపునిచ్చాయి.

భారత్ బంద్- తెలుగు రాష్ట్రాల్లో మోడీకి ఊరట!: బంద్‌కు కెసీఆర్ నో, కానీభారత్ బంద్- తెలుగు రాష్ట్రాల్లో మోడీకి ఊరట!: బంద్‌కు కెసీఆర్ నో, కానీ

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించే అవకాశం లేదు. ఎన్డీయే మిత్రపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలతో పాటు ఇతర పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు కూడా బందును వ్యతిరేకిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో తెరాస అధికారంలో ఉంది. అది బీజేపీ మిత్రపక్షం కాదు. అయినప్పటికీ బందులో పాల్గొనడం లేదు. ఏపీలో మిత్రపక్షం టిడిపి అధికారంలో ఉంది. అక్కడ ప్రతిపక్షం వైసిపి బందుకు మద్దతిస్తోంది.

bharat bandh

ఎన్డీయే పక్షాలు అధికారంలో లేని బీహార్ (నితీష్ కుమార్ ముఖ్యమంత్రి, జేడీయు అధికార పార్టీ), పశ్చిమ బెంగాల్ (మమతా బెనర్జీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధికార పార్టీ)లో తదితర రాష్ట్రాల్లో బందుకు మద్దతు లభించలేదు. నితీష్ కుమార్ నోట్ల రద్దును స్వాగతించారు. కాబట్టి బందులో పాల్గొనడం లేదు.

మమత మాత్రం నోట్ల రద్దును తూర్పారబడుతూనే బందును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా, బెంగాల్లో తన ప్రతిపక్షమైన లెఫ్ట్ పార్టీ బందుకు పిలుపునివ్వడంతో మమత వ్యతిరేకిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించనుంది.

రూ.2000 నోటుపై ఉర్జీత్ సంతకమా.. పాయింట్ లేవనెత్తిన రఘువీరారూ.2000 నోటుపై ఉర్జీత్ సంతకమా.. పాయింట్ లేవనెత్తిన రఘువీరా

సిద్ధరామయ్య ట్విస్ట్

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బంద్‌కు మద్దతు ఇవ్వడం లేదని, కానీ నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తామని చెప్పారు.

బ్యాంకులు తెరిచి ఉంటాయా, మూసివేస్తారా?

శని, ఆదివారాలు కావడంతో రెండు రోజులుగా బ్యాంకులు పూర్తిగా మూతపడ్డాయి. అయితే నోట్ల రద్దుకు నిరసనగా సోమవారం విపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ప్రాంతీయ పార్టీలు కూడా మద్థతు తెలుపుతున్నాయి.

కానీ, ఈ బంద్‌కు అన్ని వర్గాల నుంచి మద్ధతు లేదని చెప్పవచ్చు. అసలే నోట్ల రద్దుతో నానా అగచాట్లు పడుతున్న ఈ తరుణంలో బ్యాంకులు ఉంటుందే అంతంత మాత్రం. బ్యాంకులున్న రోజుల్లో కూడా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

అలాంటిది బ్యాంకులు ఉన్న రోజు కూడా బంద్ చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈ బంద్‌తో సామాన్యుల కష్టాలు తీరతాయా అనే ప్రశ్నకు విపక్షాల దగ్గర సమాధానం లేదు. ఈ పరిస్థితుల్లో బంద్‌ విజయవంతం కాకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రజలు కూడా బంద్‌కు విముఖత చూపే అవకాశమున్నందున ఎక్కువ శాతం బ్యాంకులు యధావిధిగా తెరుచుకునే అవకాశముంది. బ్యాంకులు కూడా బంద్‌పై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకులు యధావిధిగా కొనసాగేలా చూడాలని, ఆందోళన జరగకుండా పోలీసు భద్రత కల్పించాలని కేంద్రానికి బ్యాంకుల ఉన్నతాధికారులు ఇప్పటికే కోరారు.

English summary
While opposition parties have attempted to corner the BJP in the parliament over demonetisation, they seem to be divided over their stand on Bharath Bandh. While non-BJP governed states have called for protests, many leaders have chosen to oppose bandh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X