• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Bihar:డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఢమాల్,హైకోర్టు జోక్యం చేసుకోవాలి, క్రిమినల్స్ కోసం మోదీ పాట్లు, తేజస్వీ!

|

పాట్నా/ బీహార్/ మంగేరి: బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగే ఒక్క రోజు ముందు దుండగులు కాల్పులు జరపడంతో వారిని అదుపు చెయ్యడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ అమాయకుడు బలి అయ్యాడు. బీహార్ లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం (JD (U)-BJP) కనుసైగల్లోనే పోలీసులు కాల్పులు జరిపారని, ఈ విషయంపై బీహార్ హైకోర్టుతో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆర్ జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.

త్వరలో ఈ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఢమాల్ అవుతోందని తేజస్వీ యాదవ్ అన్నారు. నిందితులను కాపాడటానికి మోదీ ప్రయత్నిస్తున్నారని బుధవారం పోలింగ్ మొదలైన కొంత సేపటికే తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.

Video viral: 150 మందిలో రేప్ సీన్, ఎడిటింగ్ లో ఎగిరింది, నెట్ లో ఫర్ సేల్, నటి ఆత్మహత్యాయత్నం!Video viral: 150 మందిలో రేప్ సీన్, ఎడిటింగ్ లో ఎగిరింది, నెట్ లో ఫర్ సేల్, నటి ఆత్మహత్యాయత్నం!

దుర్గాదేవి ఊరేగింపులో స్కెచ్

దుర్గాదేవి ఊరేగింపులో స్కెచ్

బీహార్ లోని మంగేరిలో దసరా పండుగ సందర్బంగా దుర్గాదేవికి స్థానికులు ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేసే సందర్బంలో గొడవలు జరిగాయి. ఆ సందర్బంలో పోలీసులు, స్థానిక ప్రజల మద్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. అదే సమయం కోసం పక్కా స్కెచ్ తో వేచి చూస్తున్న కొందరు దుండుగు పోలీసులపై కాల్పులు జరిపారు.

అమాయకుడు బలి?

అమాయకుడు బలి?

దుండగులు కాల్పులు జరపడంతో అంతవరకు సహనంగా ఉన్న పోలీసులపై కొందరు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనాయి. ఈ గొడవల్లో తుపాకి తూటాలకు 18 ఏళ్ల యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పరిస్థితి అదుపు తప్పడంతో అప్పుడు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారని పోలీసు అధికారులు అంటున్నారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం

డబుల్ ఇంజన్ ప్రభుత్వం

మంగేరిలో దసరా పండుగ సందర్బంగా దుర్గాదేవి నిమజ్జనం ఊరేగింపు సందర్బంగా జరిగిన కాల్పులపై హైకోర్టు జోక్యం చేసుకుని ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని RJD నాయకుడు తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. బీహార్ లో మొదటి విడత పోలింగ్ ప్రారంభం అయిన కొంత సేపటికి ఆయన ఆ రాష్ట్రంలోని JD(U)- BJP సంకీర్ణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీహార్ లో ప్రస్తుతం ఉన్న డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో మంగళం పాడేస్తారని, ఆ ప్రభుత్వం కచ్చితంగా ఢమాల్ అవుతుందని ఆర్ జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు.

మోదీ స్కెచ్ తో ఇంత జరిగింది

మోదీ స్కెచ్ తో ఇంత జరిగింది

మంగేరిలో దసరా పండుగ సందర్బంగా దుర్గాదేవి నిమజ్జనం ఊరేగింపు సందర్బంగా జరిగిన కాల్పుల్లో అమాయకుడు బలి అయ్యాడని తేజస్వీ యాదవ్ ఆరోపించాడు. కాల్పుల్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 50 లక్షలు నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ నేరస్తులను, పోలీసులను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారని తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కనుసైగలతోనే మంగేరిలో కాల్పులు జరిగాయని, ఈ విషయంపై హైకోర్టు జోక్యం చేసుకుని ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు.

తెర మీదకు తుప్పు తుపాకులు

తెర మీదకు తుప్పు తుపాకులు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇంతకాలం ఇంట్లో తుప్పు పట్టిన తుపాకులకు కొందరు దుండగులు పని చెప్పారు. పవిత్రంగా పూజించిన దుర్గాదేవిని నిమజ్జనం చేసే సందర్బంలో ఆ జిల్లా ఎస్పీని టార్గెట్ చేసుకుని విచక్షణారహితంగా కొందరు దుండగులు కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు అంటున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో సుమారు 20 మంది పోలీసులు గాయాలతో తప్పించుకోగా ఓ అమాయకుడు బలైపోయాడు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు బీహార్ లో దుండగులు రెచ్చిపోవడంతో స్థానిక ప్రజలు ఓటు వెయ్యాలా ? వద్దా ? దేవుడా అంటూ భయంతో హడలిపోతున్నారు.

English summary
Bihar Assembly Election 2020: RJD leader Tejashwi Yadav said, Bihar's deputy CM had appealed to criminals to keep low for now, and continue with their activities later. This speaks volumes about the law and order situation in state. He further added, "We condemn firing by police in Munger. This double-engine govt definitely had a role in it. We want to ask Deputy CM Sushil Modi who gave permission to become General Dyer? We want High Court-monitored probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X