Bridge: బ్రిడ్జి కూలలేదు.. కావాలనే కూల్చారు.. అసలు ఏం జరిగిందంటే..!

బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూల్చివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నిన్న సాయంత్రం నాలుగు లేన్ల వంతెన కూలిపోయిన వెంటనే, బీహార్ ప్రభుత్వం మీడియాతో మాట్లాడుతూ నిర్మాణంలో "తీవ్రమైన లోపాలు" ఉన్నాయని అందుకే కూల్చివేశామని చెప్పింది.

"గత ఏడాది ఏప్రిల్ 30న ఈ వంతెన కొంత భాగం దెబ్బతింది. ఆ తర్వాత, మేము ఒక అధ్యయనం చేయడానికి నిర్మాణ విషయాలలో నైపుణ్యం కలిగిన IIT-రూర్కీని సంప్రదించాము. ఇది ఇంకా రావాల్సి ఉంది. తుది నివేదికతో కానీ నిర్మాణంపై అధ్యయనం చేసిన నిపుణులు తీవ్రమైన లోపాలున్నాయని మాకు తెలియజేసారు" అని ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

Bihar CM Nitish Kumar reacted to the demolition of the cable bridge in Bihar

"అనేక నిర్మాణ లోపాలను నిపుణులు ఎత్తి చూపారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని అన్నారు. తాము ఎటువంటి అవకాశం తీసుకోకూడదని నిర్ణయించుకున్నామని అధికారి చెప్పారు. ఈ వంతెనను భాగల్ పుర్, ఖగడియా జిల్లాలను కలుపుతూ నిర్మిస్తున్నారు. అగువానీ - సుల్తాన్‌గంజ్‌ వంతెన పిల్లర్లు గత ఏప్రిల్‌ నెలలో తుపాను కారణంగా కొంతభాగం దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. భవిష్యత్తు లో ఎలాంటి అనర్థలు జరుగకుండా ఉండేందుకు కూల్చివేశామన్నారు.

ఈ బ్రిడ్జి నిర్మాణానికి 2015లో నీతీశ్ కుమార్ శంకుస్థాపన చేశారు. దీన్ని 2020 వరకు పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ వంతెన నిర్మాణానికి బీహర్ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఈ బ్రిడ్జి కూలుతున్నప్పుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంతెన దగ్గర పనిచేస్తున్న గార్డు కనిపించకుండా పోయాడు. రెస్క్యూ అధికారులు అతని కోసం గాలిస్తున్నారు.

బ్రిడ్జి కూలిన తర్వాత ఎస్పీ సింగ్లా కంపెనీలో గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి కనిపించకుండా పోయాడని చెబుతున్నారు. అతడి మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అతడి కోసం SDRF, NDRF బృందాలు వెతుకులాట సాగిస్తున్నాయని సర్కిల్ ఆఫీసర్ చందన్ కుమార్ తెలిపారు. కాగా ఈ బ్రిడ్జి కూల్చివేతపై బీజేపీ ప్రభుత్వం విమర్శులు చేసింది. బీహర్ సీఎం నీతీష్ కుమార్‌కు రాజకీయ స్థిరత్వం లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించింది.

నీతీష్ పాలనలో కమీషనర్లు పెరిగిపోయాయని విమర్శించింది. బ్రిడ్జి కూల్చివేతపై ఆ రాష్ట్ర సీఎం నీతీష్ కుమార్ స్పందించారు. ఈ వంతెన నిర్మాణం బాధ్యత చేపట్టిన సంస్థదేనని స్పష్టం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+