వాళ్లు కూడా నరేంద్రమోడీయే ప్రధానమంత్రి అవుతారని..

హైదరాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కాబోయే ప్రధాని అని చాలామంది గట్టిగా విశ్వసిస్తున్నారు. దేశవ్యాప్తంగా బిజెపి గెలుపు పైన పెద్ద ఎత్తున పందాలు కాస్తున్నారని సమాచారం. మన రాష్ట్రంలోని మోడీ గెలుపు పైన పందాలు కాస్తున్నారట.

మన రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య పోటా పోటీ ఉన్నట్లు భావిస్తున్నారు. కేంద్రం విషయానికి వస్తే మాత్రం అందరు బిజెపినే గెలవనుందని అంచనాలు వేస్తున్నారు. మే 16వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

BJP favourite, tipped to win over 200 seats

బిజెపి 200 లోకసభ సీట్లకు పైగా గెలుస్తుందని, కాంగ్రెసు పార్టీ వంద సీట్లకు అటు ఇటు మాత్రమే పరిమితమవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. పందెంరాయుళ్లు కూడా బిజెపి గెలుపు పైనే పందాలు కాస్తున్నారట. కాబోయే ప్రధాని మోడీ అని వారు కూడా భావిస్తున్నారట.

మరికొందరు మిత్రులను కలుపుకొని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మోడీ ప్రధాని అవుతారని భావిస్తున్నారట. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారట. ఈ కారణంగానే మోడీ పైన పంటర్స్ తక్కువ మొత్తం ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట.

మోడీ కాబోయే ప్రధాని అని భావిస్తున్నందున.. ఆయన పైన రూపాయికి కేవలం 42 పైసలు మాత్రమే ఇస్తున్నారట. అదే ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన రూపాయికి ఆరున్నర ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పైన రూపాయికి 500 ఇచ్చేందుకు సిద్ధమయ్యారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+