ఝార్ఖండ్‌లో పేలుడు : ముగ్గురి మృతి, ఇద్దరికీ గాయాలు
ఝార్ఖండ్ : ఝార్ఖండ్‌లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుళ్లలో ముగ్గురు మృతిచెందారు. గిరిదిహ్ జిల్లా పాదంతండ్‌లో బావి తవ్వేందుకు అడ్డుగా ఉన్న రాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను తీసుకురాగా .. ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు.

ప్రమాదవశాత్తు ..
పేలుడు పదార్థాలను ఓ వ్యక్తి టూ వీలర్‌పై తీసుకొచ్చారు. వాటిని కిందకు దించే క్రమంలో అనుకోకుండా పేలుడు జరిగింది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. అక్కడక్కడ గాయాలయ్యాయని .. త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు.
కుట్రకోణం ..?
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలపారు. ప్రమాదవశాత్తు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని పేర్కొన్నారు. అయితే ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే అని కూడా ఆరా తీస్తామని తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం చేసి ... బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు. గాయపడ్డవారి వైద్య చికిత్సను ప్రభుత్వమే చేయిస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications