అప్పను, గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపించింది ఎవరు ? సవతి తల్లి ప్రేమ, బంజరు భూముల పార్టీ, అశోక్ !

కర్ణాటక మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపించింది ఎవరు ? అని కాంగ్రెస్ నాయకులను మంత్రి అశోక్ ప్రశ్నించారు.

బెంగళూరు/కోలారు: కొంత మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు వింటున్న ప్రజలు నవ్వుకుంటున్నారని, వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడంలేదని కర్ణాటక రెవెన్యూ శాఖా మంత్రి ఆర్. అశోక్ ఎద్దేవ చేశారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని జైలుకు పంపించింది ఎవరు ? అని కాంగ్రెస్ నాయకులను మంత్రి అశోక్ ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని మంత్రి అశోక్ గుర్తు చేశారు.

మీ సవతి తల్లి ప్రేమ మాకు అక్కర్లేదు

మీ సవతి తల్లి ప్రేమ మాకు అక్కర్లేదు

బీఎస్. యడియూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలోనే మీరు వాళ్లను జైలుకు పంపించారని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మంత్రి అశోక్ మండిపడ్డారు. ఆ రోజు మీరే జైలుకు పంపించారు. ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి యడియూరప్పకు, గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ అన్యాయం చేసిందని మాట్లాడుతున్నారని మంత్రి అశోక్ మండిపడ్డారు. ఈ రోజు మీరు యడియూరప్ప మీద, గాలి జనార్దన్ రెడ్డి మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారా ?, వాళ్ల గురించి జాలిగా మాట్లాడుతున్నారా ? అంటూ కాంగ్రెస్ నాయకుల మీద మంత్రి అశోక్ విరుచుకుపడ్డారు.

అధికారం ఎవరిది అని అందరికి తెలుసు

అధికారం ఎవరిది అని అందరికి తెలుసు

కర్ణాటకలో మళ్లీ మేమే అధికారంలోకి వస్తామని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్. అశోక్ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్ల కంటే ఎక్కువగా వస్తాయని, అందులో ఎలాంటి డౌట్ లేదని మంత్రి అశోక్ జోస్యం చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రారంభించనున్న రథయాత్రతో కేంద్రంలో ప్రధాని మోదీ, కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఎంత మేలుచేసింది అని పూర్తిగా వివరిస్తామని మంత్రి అశోక్ చెప్పారు. కర్ణాటక మొత్తం రథయాత్రలు చేపడుతున్నామని మంత్రి అశోక్ వివరించారు.

కాంగ్రెస్ బంజరు భూముల పార్టీ

కాంగ్రెస్ బంజరు భూముల పార్టీ

కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేక ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు తలపట్టుకుంటున్నారని మంత్రి ఆర్. అశోక్ వ్యంగంగా అన్నారు. మీ పార్టీలో నాయకులకే దిక్కులేదు. ఇక మీ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు మీరు ఏం న్యాయం చేస్తారని మంత్రి అశోక్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అంటే బంజరు భూముల పార్టీ అని, ఆ పార్టీ నాయకుల పని అయిపోయిందని, వారిని ప్రజలు నమ్మరని మంత్రి అశోక్ అన్నారు. కర్ణాటకలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వందకు వంద శాతం మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అర్, అశోక్ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+