మహిళపై నాలుగేళ్లు రేప్: బిఎస్పీ ఎంపిపై చార్జిషీట్
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగి అయిన 42 ఏళ్ల మహిళపై దాదాపు నాలుగేళ్ల పాటు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణపై బిఎస్పీ పార్లమెంటు సభ్యుడు ధనంజయ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు సింగ్‌ను, డెంటల్ సర్జన్ అయిన ఆయన భార్య జాగృతిని పోలీసులు పనిమనిషి హత్య కేసులో నిరుడు నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.
వారి అరెస్టు తర్వాత వారిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. హత్య అభియోగాలపై పోలీసులు శనివారం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. కాగా, సింగ్ మహిళపై 2005 జులై నుంచి 2009 మార్చి వరకు వరుసగా అత్యాచారం చేశాడని అభియోగం మోపుతూ పోలీసులు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సోను అగ్నిహోత్రి ముందు చార్జీషీట్ దాఖలు చేశారు.

తుపాకితో బెదిరించి మహిళను సింగ్ పలుమార్లు రేప్ చేశాడని, విషయం బయట చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడని పోలీసులు ఆరోపించారు. బాధితురాలి భర్త వ్యాపారి అని, అతని ద్వారా బాధితురాలికి సింగ్ పరిచయమయ్యాడని, ఆమె మొదటిసారి 2005 ఫిబ్రవరిలో సింగ్‌ను కలిసిందని పోలీసులు వివరించారు.
ఓ కేసులో సింగ్‌ను పోలీసులు నిరుడు నవంబర్ 21వ తేదీన అరెస్టు చేశారు. అతను ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. సింగ్‌ను, ఆయన భార్యను పోలీసులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications