మా వారిని రైడ్‌కి తీసుకెళ్తా: బైక్‌పై మండపానికి వధువు (ఫోటో)
అహ్మదాబాద్: గుజరాత్‌లో వధువు ద్విచక్ర వాహనం పైన పెళ్లి మంటపానికి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. సాధారణంగా వధువును పెళ్లి మంటపానికి మేనమావలు గంపలోనో లేక పల్లకిలోనో తీసుకు వస్తారు. లేదా నడుచుకుంటూ మంటపానికి వస్తారు.
ఆ సమయంలో వధువు సిగ్గుతో తలదించుకుని వివాహ మండపం పైకి చేరుకుంటుంది. ఇది మనకు ఎక్కువగా కనిపించేది. కానీ గుజరాత్‌కు చెందిన ఆయేషా ఉపాధ్యాయ్ మాత్రం భిన్నంగా పెళ్లి మండపానికి చేరుకుంది. భిన్నంగా ఉండే ఉద్దేశ్యంలో భాగంగా బుల్లెట్ బండిని ఎక్కి స్వయంగా నడుపుకుంటూ మండపానికి వచ్చింది.

ఆమెకు ద్విచక్ర వాహనాలు అంటే ఇష్టం. ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆమెకు వివాహం నిశ్చయమైంది. సోదరుడు కొత్త బుల్లెట్ బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆమె దాని పైనే దర్జాగా మండపానికి వచ్చింది. దీంతో ఆహూతులంతా తొలుత అవాక్కయ్యారు. ఉపాధ్యాయ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్.
ఆమె మట్లాడుతూ... తనకు 13 ఏళ్ల వయస్సు నుంచి బైక్‌లు అంటే ఇష్టమని చెప్పింది. తాను ముందే తన తల్లిదండ్రులకు చెప్పానని, తాను పల్లకిలో పెళ్లి మండపానికి రానని, బైక్ పైన వస్తానని చెప్పానని తెలిపింది. మరో విషయమేమంటే.. ఆయేషా భర్త లోకిక్‌కు బైక్ నడపడం రాదు. అతను వ్యాపారవేత్త. పెళ్లి తర్వాత అతనిని తాను రైడింగ్‌కు తీసుకు వెళ్తానని చెప్పింది.












Click it and Unblock the Notifications