బుల్లి బాయ్ యాప్: బెంగళూరులో ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు

ముంబై/బెంగళూరు: బెంగుళూరులో బుల్లి బాయి యాప్ కేసులో ఓ నిందితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ముంబైకి తీసుకెళ్తున్నారు. బుల్లి బాయి ఐదుగురు అనుచరులలో ఇతను ఒకడు. అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నిందితుడు 21ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిగా సమాచారం.

వందలాది మంది ముస్లిం మహిళల ఫోటోలను వారి సోషల్ మీడియా ఖాతాల నుంచి సేకరించి ఒక యాప్‌లో అప్‌లోడ్ చేయడంతోతోపాటు వారి "వేలంలో" పాల్గొనడానికి ప్రజలను ప్రోత్సహించారు. దీంతో పెను వివాదం చెలరేగింది

Bulli Bai app row: Mumbai Police detains suspect from Bengaluru

ఇంతలో, 'బుల్లీ బాయి' వివాదంపై ఇండియా టుడే ప్రశ్నలకు గిట్‌హబ్ ప్రతిస్పందించింది. వేధింపులు, వివక్ష, హింసను ప్రేరేపించే కంటెంట్, ప్రవర్తనకు వ్యతిరేకంగా తమ విధానాలు ఉన్నాయని పేర్కొంది.

సందేహాస్పద వినియోగదారు ఖాతా ఫ్లాగ్ చేయబడిన తర్వాత తాత్కాలికంగా నిలిపివేయబడిందని సాఫ్ట్‌వేర్ డెవలపర్ చెప్పారు.చట్ట అమలు సంస్థలతో సమ్మతి, సహకారానికి కూడా GitHub హామీ ఇచ్చింది. కాగా, బుల్లిబాయి యాప్‌పై ఇప్పటికే కేంద్రం సీరియస్ అయ్యింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

బుల్లిబాయ్ యాప్ ఏంటి?

గిట్‌హబ్ అనే యాప్‌లో పలువురు ముస్లిం అమ్మాయిల ఫొటోలను అప్‌లోడ్ చేసి, వారికి రేటును నిర్ధారించి మరీ వేలంపాటకు ఉంచారు. ఆన్‌లైన్ ద్వారా వారి వేలం పాటలను నిర్వహిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కఠిన చర్యలు తీసుకుంది. గిట్‌హబ్ యాప్‌ను బ్లాక్ చేసింది.

బుల్లి బాయి, సిల్లీ డీల్స్ పేరుతో గిట్‌హబ్ యాప్‌లో వందల సంఖ్యలో ముస్లిం అమ్మాయిలు, మహిళల ఫొటోలు అప్‌లోడ్ అయ్యాయి. ఇంత మొత్తంలో ధరను చెల్లించి, వారిని సొంతం చేసుకోవచ్చనే ప్రకటనలు ఈ యాప్‌లో కనిపించాయి. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం నాటి రాత్రి ఈ ఫొటోలు విస్తృతంగా సర్కులేట్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి తమ దృష్టికి రావడంతో తొలుత ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల్లో కేసులు నమోదయ్యాయి.

ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. గిట్‌హబ్ యాప్‌ను బ్లాక్ చేసినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ద్వారా అప్పటికప్పుడు ఈ యాప్‌ను బ్లాక్ చేయించినట్లు చెప్పారు. ప్రియాంక చతుర్వేది పోస్ట్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎఫ్ఐఆర్‌ నమోదైనట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+