విజయకాంత్: ఆరేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి...
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన డిఎండికె అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ తిరిగి సినిమాల వైపు దృష్టి సారించారు. రాజకీయ జీవితానికి విరామం ఇస్తూ తనకు అభిమానులను తెచ్చి పెట్టిన సినిమాల వైపు ఆరేళ్ల తర్వాత తిరిగి దృష్టి సారిస్తు్నారు.
దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ తెరపై ఆయన కన్పించబోతున్నారు. ఈ విషయాన్ని విజయ్‌కాంత్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తాజాగా ఆయన 'తమిళ్ ఎండ్రు సోల్' చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. తాజా చిత్రానికి కొత్త దర్శకుడు అరుణ్ పొన్నాబళం దర్శకత్వం వహిస్తున్నాడు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలతో కూటమి కట్టినప్పటికీ ఆయన పార్టీ డిఎండికె ఘోరంగా ఓటమి పాలైంది. స్వయంగా ఆయన కూడా ఓడిపోయారు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. దాంతో నిరాశ చెందకుండా తనకు ప్రజా జీవితాన్నిచ్చిన సినిమాల వైపు దృష్టి సారించారు.












Click it and Unblock the Notifications