వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24 గం.ల్లో నన్ను పిలవాలి: గవర్నర్‌పై కోర్టుకెక్కిన శశికళ

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ సోమవారం నాడు న్యాయ పోరాటానికి దిగారు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని,

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ సోమవారం నాడు న్యాయ పోరాటానికి దిగారు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అయినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని, 24 గంటల్లో ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని కోర్టును ఆశ్రయించారు.

తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, కాబట్టి గవర్నర్ తనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని శశికళ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. లేదంటే తాము న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

<strong>15 ని.లు వెయిటింగ్..: స్టాలిన్‌కు షాకిచ్చిన పన్నీరు సెల్వం</strong>15 ని.లు వెయిటింగ్..: స్టాలిన్‌కు షాకిచ్చిన పన్నీరు సెల్వం

ఈ నేపథ్యంలో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎమ్మెల్యేల మద్దతు ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. 24 గంటల్లో తనను ఆహ్వానించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను శశికళ తరఫున ఏఎల్ శర్మ దాఖలు చేశారు.

Case has been filed against TN Governor in SC

మరోవైపు, ఎమ్మెల్యేల నిర్బంధంపై కోర్టు స్పందించింది. వారిని నిర్బంధిస్తే.. బంధువులు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించింది.

మరోవైపు, శ‌శిక‌ళ తన వర్గం ఎమ్మెల్యేల‌ను ప‌లు రిసార్టుల్లో ఉంచిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ప్ర‌తిప‌క్షాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యేలను అక్ర‌మంగా నిర్బంధించార‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డంతో మ‌ద్రాసు హైకోర్టు ఆదేశాల మేర‌కు స‌దరు ఎమ్మెల్యేల‌ వాంగ్మూలాల‌ను తీసుకున్న పోలీసులు ఆ నివేదిక‌ను న్యాయ‌స్థానానికి స‌మ‌ర్పించారు.

అధికారులు కోర్టుకు ఏయే అంశాలు తెలిపారో తెలియాల్సి ఉంది. మ‌రోవైపు పోయెస్‌గార్డెన్ వ‌ద్దకు భారీ సంఖ్య‌లో అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌లు చేరుకుంటున్నారు. ప్ర‌భుత్వం ఏర్పాటుకు అనుమ‌తివ్వాల‌ని వారు నినాదాలు చేస్తున్నారు.

English summary
A Case has been filed against TN Governor in SC seeking the court's order on asking the Governor to invite Sasikala to form the govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X