రైల్ నీర్ స్కాం కేసు: సీబీఐ చార్జిషీటు

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం రేపిన రైల్ నీర్ కుంభకోణం కేసులో సీబీఐ శుక్రవారం కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. మంచినీటి సీసాల సరఫరా వ్యవహారంలో భారీ అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ రైల్ నీర్ స్కాం కేసులో నార్తరన్ రైల్వే మాజీ చీఫ్ కమర్షియల్ మేనేజర్లు సందీప్ సిలాస్, ఎం.ఎస్. చలియాలపై సీబీఐ చార్జిషీటు నమోదు చేసింది. వివిద కంపెనీల అధిపతుల మీద కేసులు నమోదు చేశామని సీబీఐ సీనియర్ అధికారి దేవ్ ప్రీత్ సింగ్ తెలిపారు.

భారతీయ రైల్వేల ద్వారా సరఫరా చేసే నాణ్యమైన మంచినీటి సీసాలకు బదులుగా చౌకరకం బాటిళ్లు సరఫరా చేసే విషయంలో అప్పట్లో అధికారంలో ఉన్న చీఫ్ కమర్షియల్ మేనేజర్లు ఇద్దరూ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి.

CBI fils chargesheet against former railway officials

పలు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించి భారతీయ రైల్వే సంస్థకు రూ. 20 కోట్లు నష్టం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. శతాబ్ధి, రాజధాని లాంటి ప్రధాన రైళ్లలో తప్పని సరి చేసిన రైల్ నీర్ కాకుండ చౌకరకం నీటి బాటిల్స్ సరఫరా చేశారని ఆరోపిస్తూ శుక్రవారం సీబీఐ 13 ప్రాంతాల్లో తనిఖీలు చేసింది.

సోదాల సమయంలో రూ. 20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికారులకు భారీగా ముడుపులు అందాయని, ప్రయివేటు క్యాటరర్లు చౌకరకం బాటిళ్లతో భారీగా లాభాలు అర్జించారని సీబీఐ ఆరోపిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+