ఐఏఎస్ డికే రవి కేసు: రీ-పోస్టుమార్టంకు సీబీఐ మొగ్గు
బెంగళూరు: సిన్సియర్ ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు, రీపోస్టుమార్టం నిర్వహించడానికి థర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో రవి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టుం నివేదికను పరిశీలించారు.
వాణిజ్య పన్నుల విభాగంలో జాయింట్ డైరెక్టర్ గా పని చేసే డీకే రవి అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. విక్టోరియా ఆసుపత్రిలో రవి మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించారు.
సీబీఐ అధికారులు రవి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. విక్టోరియా ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టుం నివేదిక, వీసేరా స్యాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబరేటరికి పంపించామని సీబీఐ అధికారులు అంటున్నారు.

గతంలో కేసు దర్యాప్తు చేసిన సీఐడి అధికారులు నివేదికలో రవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని వివరాలు పోందుపరిచారు. అయితే సీబీఐ అధికారులు మాత్రం రవి కేసు దర్యాప్తులో భాగంగా మళ్లి పోస్టుమార్టుం నిర్వహించాలని బావిస్తున్నారు.
విక్టోరియా ఆసుపత్రి వైద్యులు ఐఏఎస్ అధికారి రవి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోస్టుమార్టుం నివేదిక ఇచ్చారు. అయితే ఆ నివేదిక ఆదారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు పూర్తి చెయ్యడానికి సిద్దంగా లేరు. రవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సాటి ఉద్యోగులు తెలిపిన వివరాల ఆదారంగా విచారణ చేస్తున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications