పీఎం విశ్వకర్మ పథకానికి కేబినెట్ ఆమోదం: అతి తక్కువ వడ్డీకే రూ. 2 లక్షల రుణం, 15వేల సాయం
న్యూఢిల్లీ: 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ.. విశ్వకర్మ పథకాన్ని(PM Vishwakarma scheme) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
The PM in Union Cabinet meeting today approved ‘PM Vishwakarma’ scheme to support people with traditional skills. Under this scheme, loans up to Rs 1 lakh will be provided on liberal terms: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/3R7GsSnbhX
— DeshGujarat (@DeshGujarat) August 16, 2023
బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం భేటీలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నామని చెప్పారు. గరిష్టంగా 5 శాతం వడ్డీరేటుతో ఈ రుణాలు పొందవచ్చు. ఇందుకోసం రూ. 13 వేల కోట్లను కేంద్రం వెచ్చించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

చేతివృత్తుల వారికి రోజుకు రూ. 500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ. 15 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వడ్డీ రాయితీతో తొలుత రూ. లక్ష రుణం ఇవ్వనున్నట్లు తెలిపారు. తొలి విడత రుణం సద్వినియోగం చేసుకుంటే అదనంగా మరో రూ. లక్ష రుణం మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. వృత్తి కళాకారులు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి సహాయం ఉంటుంది.

విశ్వకర్మ పథకం ఓబీసీ సామాజికి వర్గానికి చెందిన 30 లక్షల సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని కేంద్రమంత్రి తెలిపారు.
The PM in Union Cabinet meeting today approved ‘PM Vishwakarma’ scheme to support people with traditional skills. Under this scheme, loans up to Rs 1 lakh will be provided on liberal terms: Union Minister Ashwini Vaishnaw pic.twitter.com/3R7GsSnbhX
— DeshGujarat (@DeshGujarat) August 16, 2023
ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తుల కళాకారుల.. ఉత్పత్తులు, సేవల నాణ్యత, స్థాయిలను మరింత మెరుగుపర్చడంతోపాటు దేశీయ, ప్రపంచ సరఫరా గొలుసుతో వారిని ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకంతో చేతివృత్తుల వారికి పెద్ద మొత్తంలో ప్రయోజనం చేకూరనుంది.












Click it and Unblock the Notifications