నో ఫాస్టాగ్.. కొత్త విధానంలో టోల్ వసూళ్లు

Fastag: జాతీయ రహదారులపై నిర్మించిన టోల్ ప్లాజాలకు చెక్ పడనుంది. ఫాస్టాగ్ విధానంలో టోల్ కలెక్షన్ల వ్యవస్థకు తెర దించబోతోంది కేంద్ర ప్రభుత్వం. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడంలో భాగంగా అత్యాధునిక పద్ధతుల్లో టోల్ ఫీజులను వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది.

ప్రస్తుతం జాతీయ రహదారులపై నెలకొల్పిన ప్లాజాల వాహనాల నుంచి టోల్ మొత్తాన్ని వసూలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫాస్టాగ్ విధానం అందుబాటులో ఉన్నప్పటికీ.. టోల్ ప్లాజాల వద్ద తప్పనిసరిగా కొంతసేపయినా వాహనాలను నిలిపివేయాల్సి వస్తోంది.

Centre appoints consultant for GPS based toll collection system instead Fastag

కొన్ని సందర్భాల్లో ఫాస్టాగ్ రీడర్లు మొరాయించడం, సాంకేతిక లోపాలు తలెత్తుతోండటం వల్ల టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరి నిల్చున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ.. వాహనాల రాకపోకలు సజావుగా సాగట్లేదనే అభిప్రాయానికి వచ్చింది కేంద్రం.

దీన్ని దృష్టిలో ఉంచుకుని- మరో సరికొత్త వ్యవస్థపై దృష్టి సారించింది. జీపీఎస్ ఆధారంగా టోల్ మొత్తాన్ని వసూలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. దీనికోసం కన్సల్టెంట్‌ను కూడా అపాయింట్ చేసింది. కొన్ని మార్గాల్లో ప్రయోగాత్మకంగా ఈ వ్యవస్థను అమలు చేయాలని భావిస్తోంది. అది సక్సెస్ అయితే.. దశలవారీగా దేశం మొత్తం మీద ఈ విధానంలో టోల్ వసూళ్లు మొదలవుతాయి.

ఈ విధానంలో టోల్ కట్టాలంటే ప్రతి వాహనంలో జీపీఎస్‌ వ్యవస్థ ఉండి తీరాల్సిందే. టోల్ రోడ్ల మీద రాకపోకలు సాగించాలనుకునే వారు తప్పనిసరిగా జీపీఎస్‌‌ను తమ వాహనాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా వాహన నంబర్ రిజిస్ట్రేషన్ ప్లేట్లనూ మార్చుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+