వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ సుప్రీంకోర్టు కొలీజియం వర్సెస్ మోడీ సర్కార్! ఇద్దరు జడ్జిల నియామకంలో కేంద్రం అభ్యంతరం!?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జిల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియంతో కేంద్ర ప్రభుత్వానికి వివాదం కొనసాగుతూనే ఉంది. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కెఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా, పంజాబ్‌-హర్యానా హైకోర్టు జడ్జి సూర్యకాంత్‌ను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. వీటిని మోడీ సర్కారు పక్కనబెట్టింది.

ఈ ఏడాది జనవరి 10న ఈ రెండు నియామకాలను కొలీజియం ప్రతిపాదించగా జడ్జిల నియామకంలో సీనియారిటీ సూత్రాన్ని పాటించలేదంటూ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. కొలీజియంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్రాతోపాటు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, మరో ఇద్దరు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు.

Centre Blocks Nomination Of Two Judges To SC Collegium

1990వ దశకంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులకూ కొలీజియం సిఫారసులు విరుద్ధంగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దేశంలోని 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సీనియారిటీ ప్రకారం జస్టిస్‌ జోసెఫ్‌ 12వ స్థానంలో, హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ ప్రకారం 45వ స్థానంలో ఉన్నందున సుప్రీంకోర్టు జడ్జిగా ఎలా సూచిస్తారని కొలీజియాన్ని కేంద్రం ప్రశ్నించింది.

అయితే, వారి ఎంపికకు సంబంధించి కొలీజియం పరిగణనలోకి తీసుకున్న ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అంతేగాక జస్టిస్‌ కెఎం జోసెఫ్‌ పట్ల కేంద్రం అభ్యంతరానికి పరిశీలకులు వేరే కారణాన్ని ఉటంకిస్తున్నారు. 2016లో ఉత్తరాఖండ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించగా.. జస్టిస్‌ కెఎం జోసెఫ్‌ నేతృత్వంలోని ఆ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ చర్యను కొట్టివేసింది. అందుకే జస్టిస్‌ జోసెఫ్‌ పట్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత అని పరిశీలకులు పేర్కొంటున్నారు.

English summary
In a blow to the Supreme Court collegium, the Centre has blocked the recommendations to appoint Uttarakhand high court Chief Justice KM Joseph as a judge of the SC and Justice Surya Kant of Punjab and Haryana HC as Chief Justice of the Himachal Pradesh high court on the grounds of “breach of seniority”. The names of the Justices were recommended by the collegium to the Centre on 10 January – two days before four sitting judges of the Supreme Court called an unprecedented press conference to criticise the Chief Justice of India, Dipak Misra. At the time, the CJI-headed collegium had said “(Justice K M Joseph) is more deserving and suitable in all respects than other chief justices and senior judges of the high courts for being appointed as SC judge”. However, the Centre is of the view that Justice KM Joseph is “too junior”. On the other hand, the appointment of Justice Surya Kant as chief justice of Himachal HC, has sparked a controversy with sitting and retired SC judges terming this a “clear case of favouritism achieved through unjust supersession of Justice AK Mittal, who is senior to Justice Kant”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X