పది రోజుల్లో విభజనకు ఆదేశం, కాదంటున్న అధికారులు
న్యూఢిల్లీ/ హైదరాబాద్: పది రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టాలని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. పది రోజుల్లో విభజన ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అధికారుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మహంతి రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
విభజన ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేయడం సాధ్యం కాదని, కనీసం మూడు నెలల సమయం పడుతుదని వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అన్నట్లు తెలుస్తోంది. తక్షణం శాఖల వారీగా విభజన ప్రక్రియ ప్రారంభించాలని సిఎస్ వివిద శాఖాధిపతులను ఆదేశించినట్లు సమాచారం. మొత్తం 78 వేల రాష్ట్ర క్యాడర్ ఉందని, అందులో 50 వేల మందిని బదిలీ చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

కాగా, మహంతి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతోనూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్‌తోనూ సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులతోనూ సమావేశం అవుతారని తెలుస్తోంది. విభజన ప్రక్రియకు అపాయింటెడ్ డే నిర్ణయించడానికి ఈ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నారు.
కాగా, కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాకు, మంత్రి నారాయణ స్వామికి వేర్వేరుగా లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రణాళిక సంఘంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని జైరాం రమేష్ ఆహ్లువాలియాను కోరారు. అలాగే వెనకపడిన ప్రాంతాల అభివృద్ధికి పక్కా ప్రణాళికను రూపొందించాలని కూడా సూచించారు.
ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడే రెండు రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీకి రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నారాయణస్వామిని కోరుతైూ జైరాం రమేష్ లేఖ రాశారు. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల పంపిణీకి ఓ కమిటీనీ, రాష్ట్ర సర్వీసు ఉద్యోగుల పంపిణీకి మరో కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications