రాజకీయాలకోసం విడదీస్తున్నారు: బర్దన్, కల్సిన బాబు

అనంతరం బర్దన్ విలేకరులతో మాట్లాడారు. ఎపి విషయంలో కేంద్ర ప్రభుత్వం అచేతనంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని అనిశ్చితిని తొలగించేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. రెండు ప్రాంతాల నేతలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందన్నారు.
ఉద్యమాల వల్ల ఇరు ప్రాంతాలలోను ద్వేషం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెసు పార్టీ విభజన పేరుతో రాజకీయం చేస్తోందని, ఇది సరికాదన్నారు.
రాష్ట్రంలోని తాజా పరిస్థితుల పైన తాను బర్దన్‌కు వివరించానని చంద్రబాబు నాయుడు అన్నారు. సిడబ్ల్యూసి ప్రకటన చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి విలీనమవుతుందని చెప్పడం రాజకీయం కాదా అని ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల్లో విద్వేషాలను పెంచి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెసు చూస్తోందన్నారు.












Click it and Unblock the Notifications