కేంద్రంలో భాగస్వాములం, మోడీతో కొత్త శకం: ఢిల్లీలో చంద్రబాబు

న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇండియా-ఆస్ర్టేలియా బిజినెస్‌ సమ్మిట్‌ సోమవారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. సీఐఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆస్ట్రేలియా మంత్రి ఆండ్రూర్యాబ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు వివిధ కంపెనీలను ఉద్దేశించి మాట్లాడారు.

ఏపీలో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఏపీని త్వరలోనే స్మార్ట్ ఏపీగా, లాజిస్టిక్ హబ్‌గా మారుస్తామన్నారు.

Chandrababu speaks in Indo - Australian summit

పరిశ్రమల అనుమతి కోసం సింగిల్ డెస్క్ ఏర్పాటు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లతో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తోందన్నారు. త్వరలో ఈ-బిజ్ ప్రారంభిస్తామన్నారు. నరేంద్ర మోడీ రాకతో రాకతో దేశంలో కొత్త శకం ప్రారంభమైందన్నారు. తాము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నామని చెప్పారు.

సింగపూర్ మంత్రితో ఏపీ మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ సోమవారం నాడు హైదరాబాదులో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో భేటీ అయ్యారు. ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్, తదితర అంశాల పైన వారు చర్చించారు. అనంతరం ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌కు సింగపూర్ బృందం తుదిరూపు ఇవ్వనుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+