తిరిగి అలసిపోయిన రమ్య, చేదు అనుభవం (పిక్చర్స్)

బెంగళూరు: ప్రముఖ నటి, మాండ్య లోకసభ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ లోకసభ అభ్యర్థి రమ్య ప్రచారంలో దూసుకు పోతున్నారు.

అయితే, రమ్య ప్రచారం సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం జరిగింది.

రమ్య మాండ్య నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె గత ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు మరోసారి బరిలోగి దిగుతున్నారు.

రమ్య

రమ్య

నటి, లోకసభ కాంగ్రెసు అభ్యర్థి రమ్య శనివారం ఉదయం పది గంటలకు మాండ్య తాలుకాలోని బేలూరుకు పలువురు నేతలతో కలిసి ప్రచారం నిమిత్తం చేరుకున్నారు.

రమ్య

రమ్య

ఈ సమయంలో స్థానిక నాయకుడు ఒకరు రమ్య కాన్వాయ్ ఎక్కే ప్రయత్నాలు చేశారు. దానిని మరికొందరు నాయకులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆయను వాహనం ఎక్కేందుకు ఇంకొందరు సహకరించారు.

రమ్య

రమ్య

అదే సమయంలో మరో నేత వాహనం ఎక్కేందుకు ప్రయత్నించారు. మరో వర్గం ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

రమ్య

రమ్య

రమ్య ప్రచారం కబ్బనహల్లికు చేరుకునే సరికి ఈ వాగ్వాదం ముదిరింది. ఇరువర్గాలు వ్యతిరేక వర్గాల బ్యానర్లు తొలగించే ప్రయత్నాలు చేశారు. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి.

రమ్య

రమ్య

ఈ సమయంలో ఇరువర్గాల మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఓ కార్యకర్త ప్రచార వాహనం చక్రాల కింద పడ్డారు. ఆయనకు గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించారు.

రమ్య

రమ్య

కాగా, ప్రముఖ నటుడు అంబరీష్ ఈ నెల 14వ తేదీ నుండి మాండ్య లోకసభ నియోజకవర్గం పరధిలో రమ్య కోసం ప్రచారం చేయనున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+